KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. BRS నేతల్లో టెన్షన్

హుటా హుటిన ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ అరెస్ట్ అయ్యే అవకాశం అంటూ ప్రచారం బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన MLC Kavita in front of ED on Saturday విధాత: ఢిల్లీ మద్యం కుంబకోణం కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavita) శనివారం విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం కవిత విచారణకు ఈడీ(ED) కార్యాలయానికి వెళ్లనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ సమావేశం ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్‌(KTR) హుటా హుటిన ఢిల్లీ(DELHI)కి బయలు […]

KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. BRS నేతల్లో టెన్షన్
  • హుటా హుటిన ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్‌
  • అరెస్ట్ అయ్యే అవకాశం అంటూ ప్రచారం
  • బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన

MLC Kavita in front of ED on Saturday

విధాత: ఢిల్లీ మద్యం కుంబకోణం కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavita) శనివారం విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం కవిత విచారణకు ఈడీ(ED) కార్యాలయానికి వెళ్లనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ సమావేశం ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్‌(KTR) హుటా హుటిన ఢిల్లీ(DELHI)కి బయలు దేరి వెళ్లారు.

మద్యం కుంబకోణంలో ఇప్పటికే అరెస్ట్‌(Arrest) అయిన రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai) తాను కవిత బినామి(Kavitha Binami)నని తెలిపారు. దీంతో ఈడీ ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు నోటీస్‌(Notice)లు జారీ చేసింది. అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల15వ తేదీ తర్వాత హాజరవుతానని ఈడీకి తెలిపారు. అయితే ఈడీ ఈనెల11వ తేదీన విచారణకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చింది. దీంతో 10వ తేదీన ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చేపట్టిన‌ ధర్నా కార్యాక్రమంలో కవిత పాల్గొన్నారు. 11వ తేదీ విచారణకు హాజరు కావడం కోసం కవిత ఢిల్లీలోనే ఉన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.

మద్యం కుంబకోణం కేసులో కవితను సాక్షిగా హాజరు కావాలని గత డిసెంబర్‌ నెలలో ఈడీ నోటీస్‌లు ఇచ్చింది. సౌత్‌ గ్రూప్‌లో ఉన్న వారి పరిచయాలపై ఆరా తీసింది. అతి తక్కువ సమయంలో 7 సిమ్‌లను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానిపై ఈడీ ప్రశ్నించింది. ఈ కుంబకోణం కేసులో ఇప్పటికే కవితకు చెందిన ఆడిటర్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ, ఆతరువాత రామచంద్ర పిళ్లైని అరెస్ట్‌ చేసింది.

ఈ మధ్య కాలంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే… అయితే రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని తెలుపండంతో కవితను విచారించడానికి ఈ డీ నోటీస్‌లు జారీ చేసింది. అయితే శుక్రవారం రామచంద్ర పిళ్లై తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

ఎమ్మెల్సీ కవిత విచారణ శనివారం రామచంద్ర పిళ్లై సమక్షంలోనే విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు కవితను విచారణకు పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చెల్లెలు కవితకు అండగా ఉండడంతో పాటు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రి కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌

కవితకు ఈడీ నోటీస్‌లు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ స్పంద‌న చూసిన తరువాత బీఆర్‌ ఎస్‌ వర్గాలకు టెన్షన్‌ పట్టుకుంది. ఈడీ విచారణ తరువాత కవితను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు, నిర్వేదంతో అరెస్ట్‌ చేస్తే చేసుకోనీయండి.. ఎవరికీ భయపడేది లేదని గద్గద స్వరంతో చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ నేతల్లో అరెస్ట్‌ తప్పదా? అన్న టెన్షన్‌ పట్టుకున్నట్లు తెలుస్తోంది.