నాది తెలంగాణే.. కేటీఆర్ భార్యది ఆంధ్రే క‌దా: YS ష‌ర్మిల‌

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోదాలు చేయాలి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో ష‌ర్మిల‌ విధాత‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబంపై వెఎస్ ష‌ర్మిల దాడులు చేయాల‌ని పిలుపునిచ్చారు. గురువారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ క‌విత‌, కేటీఆర్ ఇండ్ల‌పై దాడులు చేయాల‌ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోదాలు చేస్తే వేల కోట్ల రూపాయ‌లు దొరుకుతాయ‌ని అన్నారు. కేసీఆర్ ఆదేశాల‌తోనే నాపై దాడులు చేశార‌న్నారు. న‌న్ను అరెస్ట్ చేస్తే పాద‌యాత్ర ఆగిపోతుంద‌ని అనుకుంటున్నార‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ పాద‌యాత్ర ఆగ‌ద‌ని […]

  • By: krs    latest    Dec 01, 2022 8:09 AM IST
నాది తెలంగాణే.. కేటీఆర్ భార్యది ఆంధ్రే క‌దా: YS ష‌ర్మిల‌
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోదాలు చేయాలి
  • గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో ష‌ర్మిల‌

విధాత‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబంపై వెఎస్ ష‌ర్మిల దాడులు చేయాల‌ని పిలుపునిచ్చారు. గురువారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ క‌విత‌, కేటీఆర్ ఇండ్ల‌పై దాడులు చేయాల‌ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోదాలు చేస్తే వేల కోట్ల రూపాయ‌లు దొరుకుతాయ‌ని అన్నారు. కేసీఆర్ ఆదేశాల‌తోనే నాపై దాడులు చేశార‌న్నారు.

న‌న్ను అరెస్ట్ చేస్తే పాద‌యాత్ర ఆగిపోతుంద‌ని అనుకుంటున్నార‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ పాద‌యాత్ర ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. అవినీతిని ప్ర‌శ్నిస్తే రెచ్చ‌గొట్టడం అవుతుందా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. న‌న్ను ఆంధ్రా అని మాట్లాడుతున్న‌ర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఇక్క‌డే పెరిగాను, ఇక్క‌డే చ‌దివాను, ఇక్క‌డే పెళ్లి చేసుకున్నాన‌ని అన్నారు. నాగ‌తం, నా భ‌విష్య‌త్ ఇక్క‌డే అని స్ప‌ష్టం చేశారు.

త‌న‌ను ఆంధ్రా అని అంటున్నార‌ని, కేటీఆర్ భార్య కూడ ఆంధ్ర‌నే క‌దా అని అడిగారు. కేటీఆర్ త‌న భార్య‌తో విడాకులు తీసుకోవాల‌ని అడుగుతున్నామా? అని అన్నారు. కేటీఆర్ త‌న భార్య‌ను ఏవిధంగా గౌర‌వంగా చూసుకుంటున్నారో, త‌న‌ను కూడా ఒక ఆడ‌బిడ్డ‌గా గౌర‌వంగా చూసుకోవాల‌న్నారు. తాను గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌న‌పై దాడి వివ‌రాల‌ను తెలియ జేశాన‌ని ష‌ర్మిల తెలిపారు.