మూనాళ్ళ ముచ్చట. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన కుంభం అనిల్

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో:ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఎదురవుతున్నాయి.. ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అది కేవలం మూనాళ్ళ ముచ్చటగానే మిగిలింది. పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే తిరిగి సొంతగూటికి కుంభం చేరారు.
ఇప్పటికే నల్గొండ జిల్లాకు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి చెందిన కుంభం అనిల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడంతో జిల్లాలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి.
తాజాగా సోమవారం భువనగిరి మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించగా అదే రోజు రాత్రి తన అనుచరులతతో కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.