KCR | కుంభం అనిల్ రాజకీయ భవిష్యత్తుకు నాదే జిమ్మెదారి: సీఎం కేసీఆర్
KCR | విధాత, బీఆరెస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని, తొలుత రాష్ట్ర సాధన కోసం, ఇప్పుడు తెలంగాణ పునర్ నిర్మాణం , అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రగతిభవన్ల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు తెలంగాణకు 24గంటల ఉచిత విద్యుత్తు […]

KCR |
విధాత, బీఆరెస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని, తొలుత రాష్ట్ర సాధన కోసం, ఇప్పుడు తెలంగాణ పునర్ నిర్మాణం , అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రగతిభవన్ల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు తెలంగాణకు 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరాలో బీఆరెస్ ప్రభుత్వ రాజీ పడబోదన్నారు. కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల కరెంటు ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ధరణి రైతులకు మేలు చేసేందుకు తెచ్చిందన్నారు.
భూ వివాదాలను తగ్గించి మెరుగైన రికార్డులు, క్రయవిక్రయాల సరిళీకరణకు ధరణి తెచ్చామన్నారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలందరికి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆగమాగం రాజకీయాలు సాగుతున్నాయన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆరెస్ లో చేరిక హర్షణీయమన్నారు. పైళ్ల, కుంభం కలిస్తే ఇక అక్కడ మిగతా పార్టీలకు మిగిలేది భస్మమేనన్నారు. యాదాద్రి జిల్లా అభివృద్ధికి యాదాద్రి ఆలయం అభివృద్ధి చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బస్వాపురం రిజర్వాయర్ తో ఆలేరు, భువనగిరి ప్రాంతాల కరువు సమసిపోతుందన్నారు.
ఏయమ్స్, యాదాద్రి మెడికల్ కళాశాలతో జిల్లా ప్రగతి పథంలో సాగుతుందన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాత కొత్త అనే బేధం లేకుండా అందరిని కలుపుకుని పోవాలన్నారు. పార్టీలో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే జిమ్మెదారి అన్నారు. నా ప్రాణం పోయినా ఇచ్చి మాటపై వెనకడుగు వేసేది లేదన్నారు.
సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా కోటిరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయనకు పిలిచి ఎమ్మెల్సీ చేశానన్నారు. నేనే కుంభంకు చెప్పానని, ఇద్దరు పోటీపడి కోట్లు దండుగ చేసుకోకుండా జోడెడ్లుగా బీఆరెస్ కోసం పనిచేయాలని చెప్పానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.హరీష్ రావు, జి.జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ
బీఆర్‌ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రాజకీయం కోసం కాదు.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్భవించిన పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు. గతంలో ఎంతోమంది చాలా పెద్దలు ఉద్యమంలో పని చేశారని, ఎందరో త్యాగాలు చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా.. మళ్లీ స్టార్ట్ చేసి కొట్లాడామని, ఇదంతా కండ్ల ముందు జరిగిన చరిత్ర అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నామని, భగవంతుడి దయ, తెలంగాణ ప్రజల అదృష్టంతో చాలాగొప్పగా రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. అప్పుడు చాలా తికమక పెట్టారని, హైదరాబాద్ విషయంలో కాంప్రమైజ్ కావాలని కావాలన్నారని.. హైదరాబాద్ లేని తెలంగాణ ఎందుకు..? తలకాయ లేని మొండెం ఇస్తే మాకెందుకు ప్రాణం పోయినా ఒప్పుకోమని చెప్పి.. చివరకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
కలబడి, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు. రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని, గతంలో ఎంతో మంది సీఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారన్నారు. గతంలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, జనరేట్లు ఉండేవని, ప్రస్తుతం నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు.
24 గంటల విద్యుత్ ఇవ్వడానికి అధికారులతో మాట్లాడానని, కరెంటును కొనాల్సి వస్తుందంటే ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ అందిస్తున్నామ న్నారు. మూడు గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే ఎవరికి అవసరమున్నప్పుడు వాళ్లు వాడుకుంటారని తెలిపారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. 24 గంటల కరెంటు సరఫరాతో రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని, గతంలో వడ్లు తీసుకుపోయి మార్కెట్లలో ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కళ్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.
ఇవాళ రోడ్లకు ఇరువైపులా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, రైస్ మిల్లులన్నీ ధాన్యంతో నిండి పోయాయన్నారు. రూ.80వేలకోట్టు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పారు. ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని, ధరణి పోర్టల్‌లో భూములను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా ఉందని, ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి మార్చగలరన్నారు. ధరణితోనే రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగాయని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, బీమా అమలు చేస్తున్నామని, ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుందన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు నిధులు ఎలా జమవ్వాలని ప్రశ్నించారు.