ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ వస్తున్నాడు! పోటీకి సిద్ధం.. టికెట్ దక్కేనా!
విధాత: శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే.. ఎన్నికల్లో ఎవరు ఎక్కడ గెలుస్తారో అంజనం వేసి మరీ చెప్పగలిగే ఆంధ్రా ఆక్టోపస్ ఇప్పుడు టిక్కెట్ కోసం దిక్కులు చూస్తోంది. కాంగ్రెస్ జమానా.. అంటే వైఎస్సార్ హవాలో రెండు సార్లు ఎంపీగా గెలిచి హవా కొనసాగించిన ఆంధ్రా ఆక్టోపస్ ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. 2004-14 మధ్య పవర్‌ను ఎంజాయ్ చేసిన ఆక్టోపస్ ఆ రోజుల్లో పరిశ్రమలు.. పవర్ సెక్టార్ ఇలా […]

విధాత: శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే.. ఎన్నికల్లో ఎవరు ఎక్కడ గెలుస్తారో అంజనం వేసి మరీ చెప్పగలిగే ఆంధ్రా ఆక్టోపస్ ఇప్పుడు టిక్కెట్ కోసం దిక్కులు చూస్తోంది. కాంగ్రెస్ జమానా.. అంటే వైఎస్సార్ హవాలో రెండు సార్లు ఎంపీగా గెలిచి హవా కొనసాగించిన ఆంధ్రా ఆక్టోపస్ ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు.
2004-14 మధ్య పవర్‌ను ఎంజాయ్ చేసిన ఆక్టోపస్ ఆ రోజుల్లో పరిశ్రమలు.. పవర్ సెక్టార్ ఇలా రకరకాల వ్యాపారాలు నడిపారు కానీ చివరికి బ్యాంక్ డిఫాల్టర్‌గా మిగిలారు. ఈ పాటికి మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఆక్టోపస్ అంటే ఇంకెవరో కాదండి . లగడపాటి రాజగోపాల్ అన్నమాట.
ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోడానికి వీరోచిత పోరాటం చేసిన నాయకుడిగా లగడపాటికి పేరుంది. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందే సందర్భంలో తెలంగాణ ఎంపీల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి… రభస సృష్టించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పట్లో ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే ఆయన కెరీర్ కూడా చిక్కుల్లో పడిపోయింది. దీంతో అనివార్యంగా సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.
ఎన్నికల సర్వేలు చేయడం ఆయనకు హాబీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి వ్యతిరేక రిపోర్టులు వచ్చినా చెప్పేవారు. కాంగ్రెస్ నాయకుడై ఉండి కూడా నిష్పక్షపాతంగా చెబుతారనే మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ 2019లో ఏపీ ప్రజానీకం నాడిని పట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు.
మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ అది జరగలేదు. అప్పటి నుంచి లగడపాటి పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. అయితే మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశ్యంతో ఈమధ్య చంద్రబాబు, లోకేశ్‌తో ఇటీవల లగడపాటి భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం.
రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి లగడపాటి బరిలో దిగనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. అయితే ఆయనకు చంద్రబాబుతోబాటు లోకేష్, స్థానిక లీడర్లతో పొసగడం లేదు.
దీంతో ఈసారి ఆయనకు టికెట్ ఇస్తారో లేదో తెలీడం లేదు. దీంతో నానికి బదులుగా లగడపాటికి టికెట్ ఇస్తారేమోనన్న సిగ్నల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మళ్లీ విజయవాడలో తన సత్తా చూపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.