కన్నీళ్లు.. తెప్పిస్తోన్న తారకరత్న భార్య తాజా పోస్ట్
విధాత: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఇటీవల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసింది. 23 రోజులపాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన చివరి శ్వాస విడిచారు. దీంతో అటు నందమూరి కుటుంబంతో పాటు ఇటు అభిమానులలో తీవ్ర విషాదం అలుముకుంది. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా భార్య అలేఖ్య రెడ్డి […]

విధాత: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఇటీవల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసింది. 23 రోజులపాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన చివరి శ్వాస విడిచారు.
దీంతో అటు నందమూరి కుటుంబంతో పాటు ఇటు అభిమానులలో తీవ్ర విషాదం అలుముకుంది. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా భార్య అలేఖ్య రెడ్డి ఆయన లేడనే వార్తను ఇంకా జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతోంది.
ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టినరోజు. భర్తను కోల్పోయి బాధలో ఉన్న అలేఖ్య రెడ్డి పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది ఆమె. ఈ క్రమంలో తారకరత్నను గుర్తు చేసుకుంటూ అలేఖ్య రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా ఓ పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ లో ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే టూ బెస్ట్ ఫాదర్.. బెస్ట్ హస్బెండ్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్.. సో బ్యాడ్ యు విష్ యు నాన్న ఐ లవ్ యూ సో మచ్’ అంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన కూతురు నిష్కా ఇలా ఎమోషనల్ అయిందని అలేఖ్య రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్ట్ అందరి మనసులను కలచివేస్తుంది. తారకరత్న మరణంతో నందమూరి హీరోల సినిమా షూటింగ్స్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తారకరత్న మరణంతో అటు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీ లాంచింగ్, బాలకృష్ణ – అనిల్ రావిపూడి షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. బాలకృష్ణకు తారకరత్న అంటే చాలా ఇష్టం. తారకరత్నకు కూడా బాలయ్య అంటే ప్రాణం. ఈ విషయాన్ని ఇదివరకే చాలా ఇంటర్వ్యూ లో ఆయన చెప్పారు.
View this post on Instagram