Lavanya Tripathi | మెగా కోడలు.. క్యాస్ట్ ఏంటి? గూగుల్ ట్రెండింగ్‌లో లావణ్య త్రిపాఠి..! క్యాస్ట్ తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారట..!
Lavanya Tripathi | టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ తర్వాత లావణ్య త్రిపాఠి కులం గురించి పలువురు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. ఆమె తెలుగు అమ్మాయి కాకపోవడంతో ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, కాపు కులానికి చెందిన వరుణ్ తేజ్‌తో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో లావణ్య కులం ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నది. […]

Lavanya Tripathi |
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ తర్వాత లావణ్య త్రిపాఠి కులం గురించి పలువురు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట.
ఆమె తెలుగు అమ్మాయి కాకపోవడంతో ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, కాపు కులానికి చెందిన వరుణ్ తేజ్‌తో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో లావణ్య కులం ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నది.
అన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం అందరికీ గూగుల్ తల్లి ఉండనే ఉంది కదా.. లావణ్య త్రిపాఠి కులం ఏంటంటూ గూగుల్‌లో తెగి వెతికేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య పేరు గూగుల్‌లో ట్రెండింగ్‌లో టాప్‌లో ఉండడం మరో విశేషం.
లావణ్య విషయానికి వస్తే ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. యూపీలోని ఫైజాబాద్‌లో ఆమె జన్మించింది. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా.. కులాల పట్టింపు పెద్దగా లేదు. ఏ వ్యక్తి అయినా తాను చేసే పనులతోనే గొప్పవాళ్లు అవుతారు కానీ.. కులం వల్ల కాదు గతంలో వ్యాఖ్యానించింది.
తమ కుటుంబానికి సైతం కులాల పట్టింపులు లేవని చెప్పింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టు లాయర్ కాగా.. ఆమె తల్లి ఓ స్కూట్ టీచర్. ఆమెకు తమ్ముడు, చెల్లి సైతం ఉన్నారు. అయితే, సినిమారంగంలో నటించే వారికి పెద్దగా కుల, మతాల పట్టింపులు ఉండవు. అయితే, ప్రతి సందర్భంలో పలానా హీరో కులం ఏంటీ..? హీరోయిన్ కులం ఏంటీ? అంటూ ప్రశ్నించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.