బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు నోటీసులు
విధాత: ఎమ్మెల్ల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కానీ బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెంది తుషార్, జగ్గుస్వామిలపై ప్రత్యేక దర్యాప్తు బ్రుందం సిట్ లుకౌట్ నోటీస్‌లు జారీ చేసింది. ఎమ్మెల్ల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు కూడ సిట్ తన విచారణను స్వేచ్ఛగా చేసుకోవచ్చునని తెలిపింది. దీంతో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు కూడ […]

విధాత: ఎమ్మెల్ల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కానీ బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెంది తుషార్, జగ్గుస్వామిలపై ప్రత్యేక దర్యాప్తు బ్రుందం సిట్ లుకౌట్ నోటీస్‌లు జారీ చేసింది. ఎమ్మెల్ల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
సుప్రీం కోర్టు కూడ సిట్ తన విచారణను స్వేచ్ఛగా చేసుకోవచ్చునని తెలిపింది. దీంతో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు కూడ ఇతరులతో పాటు సిట్ నోటీస్‌లు ఇచ్చింది.
అయితే ఈ ముగ్గురు విచారణకు రావడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన సిట్ లుకౌట్ నోటీస్‌లు జారీ చేసింది. కాగా సైబరాబాద్ పోలీసులు దాదాపు ఆరు రాష్ట్రాలలో ఎమ్మెల్ల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్లు గుర్తించారు. ఇది ఇలా ఉండగా సిట్ విచారణకు న్యాయవాది శ్రీనివాస్ మరో సారి హాజరు కానున్నట్లు తెలిసింది.