మా.. ఈటల రాజేందర్: CM KCR! 2 గంటల ప్రసంగంలో 12 సార్లు ప్రస్తావన
విధాత: అసెంబ్లీ చివరి రోజు ముఖ్యమంత్రి ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ పదే పదే ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. రెండు గంటల పాటు ప్రసంగించిన ఆయన దాదాపు 12సార్లు వివిధ సందర్భాల్లో ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారు. నన్ను డ్యామేజ్ చేసేందుకే KCR అలా మాట్లాడారు: ఈటల కౌంటర్ తనకు భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే తీసుకుంటానని ఈటలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ అడిగారనే నెపంతో ఆ పని చేయకూడదు […]

విధాత: అసెంబ్లీ చివరి రోజు ముఖ్యమంత్రి ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ పదే పదే ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. రెండు గంటల పాటు ప్రసంగించిన ఆయన దాదాపు 12సార్లు వివిధ సందర్భాల్లో ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారు.
తనకు భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే తీసుకుంటానని ఈటలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ అడిగారనే నెపంతో ఆ పని చేయకూడదు అనే నిర్ణయానికి రావద్దని, ప్రజాస్వామ్యం కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
డైట్ ఛార్జీల ఖరారుపై ఈటలను కూడా మంత్రులు పిలిచి మాట్లాడాలని, ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చెప్పగా, సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. పలుమార్లు సభలో ఈటల రాజేందర్ పేరును సీఎం ప్రస్తావించారు.
ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 8 రోజులు, 56 గంటలు, 38 ప్రశ్నలు, 5 బిల్లులు