MP: కూతురంటే ఎంత ప్రేమో.. ఆమె ఆరోగ్యం కోసం రక్తాన్ని అమ్ముకున్న తండ్రి.. చివరకు
విధాత: ఇది హృదయ విదారక ఘటన.. ఓ తండ్రికి తన కూతురు అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ రోడ్డుప్రమాదానికి గురైంది. దీంతో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైంది. బిడ్డను బతికించుకునేందుకు సొంత ఇల్లును అమ్మాడు. అంతేకాదు.. చాలాసార్లు తన రక్తాన్ని అమ్మి, బిడ్డ నిత్యావసరాలను తీర్చాడు. కానీ చివరకు ఆ తండ్రి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో వెలుగు […]

విధాత: ఇది హృదయ విదారక ఘటన.. ఓ తండ్రికి తన కూతురు అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ రోడ్డుప్రమాదానికి గురైంది. దీంతో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైంది.
బిడ్డను బతికించుకునేందుకు సొంత ఇల్లును అమ్మాడు. అంతేకాదు.. చాలాసార్లు తన రక్తాన్ని అమ్మి, బిడ్డ నిత్యావసరాలను తీర్చాడు. కానీ చివరకు ఆ తండ్రి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో వెలుగు చూసింది.
కూతురి మాటల్లోనే.. నా పేరు అనుష్క గుప్తా(17). నేను ఐదేండ్ల క్రితం రోడ్డుప్రమాదానికి గురయ్యాను. నా వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో మంచానికే పరిమితం అయ్యాను. నన్ను బతికించుకునేందుకు సొంత ఇల్లును, దుకాణాన్ని నాన్న ప్రమోద్ గుప్తా అమ్మేశాడు. వైద్యం కోసం వేల రూపాయాలు ఖర్చు పెట్టాడు. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. పూట గడవడం కూడా కష్టమైంది.
గ్యాస్ సిలిండర్, ఆహారం కోసం నాన్న ఆయన రక్తాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. నా నిత్యావసరాలైన మెడిసిన్స్, డాక్టర్ల ఫీజు కోసం కూడా నాన్న అనేక సార్లు ఆయన రక్తాన్ని విక్రయించాడు. నాన్న మరింత బలహీనపడిపోయాడు. గత ఏడాది కాలం నుంచి కుటుంబాన్ని పోషించే స్తోమత లేకుండా పోయింది. చివరకు నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని అనుష్క కన్నీటి పర్యంతమయ్యారు.