15 నుంచి యాదగిరిగుట్ట శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయం నందు ఈనెల 15 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎం. రామకృష్ణారావు తెలిపారు. పాంచాహ్నిక దీక్షతో కొనసాగే మహా శివరాత్రి ఉత్సవాలు 15వ తేదీ బుధవారం ఉదయం స్వస్తివాచనం తో ప్రారంభమవుతాయి. 16వ తేదీ గురువారం రోజున భేరీ పూజా, దేవత ఆహ్వానం , అగ్ని ప్రతిష్ట, ద్వజాపహరోహణం […]

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయం నందు ఈనెల 15 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎం. రామకృష్ణారావు తెలిపారు.
పాంచాహ్నిక దీక్షతో కొనసాగే మహా శివరాత్రి ఉత్సవాలు 15వ తేదీ బుధవారం ఉదయం స్వస్తివాచనం తో ప్రారంభమవుతాయి. 16వ తేదీ గురువారం రోజున భేరీ పూజా, దేవత ఆహ్వానం , అగ్ని ప్రతిష్ట, ద్వజాపహరోహణం నిర్వహిస్తారు.
17వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 18వ తేదీ శనివారం మహాశివరాత్రి సందర్భంగా అభిషేకములు, రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకములు నిర్వహిస్తారు.
19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన , రాత్రి రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. 20వ తేదీ సోమవారం రోజున మహాశివరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే ఇద్దరికీ 516 రూపాయలు, మహాశివరాత్రి రోజున 18వ తేదీ జరిగే అభిషేకంలో ఇద్దరికీ 300 రూపాయలు, రాత్రి జరిగే శత రుద్రాభిషేకంలో ఇద్దరికి 516 రూపాయలు, 19 జరిగే లక్ష బిల్వార్చనలో ఇద్దరికీ 516 రూపాయలు చొప్పున రుసుము చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు.