గిన్నిస్ రికార్డు కోసం.. ఎంత పని చేశాడంటే!

విధాత: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు పెద్దలు.. గిన్నిస్ బుక్ రికార్డు (Guinnes World Records) ల్లో చోటు దక్కించుకోవడానికి కొందరు వింత మార్గాలను అనుసరిస్తారు. అలాంటి వారిలో ఒకడు కెనడాకు చెందిన మైక్ జాక్. ఇతను ప్రపంచంలో అత్యంత కారంగా ఉండే 50 పచ్చిమిర్చిలను తక్కువ సమయంలో తినేసి రికార్డు నెలకొల్పాడు. కరోలినా రీపర్స్ అని పిలిచే ఈ మిరపకాయలను 6 నిమిషాల 49.2 సెకన్లలో జాక్ తినేశాడు. ఆ తర్వాత ఒగురుస్తూ కిందా మీదా పడుతూ మరో 85 కాయలను అంటే మొత్తం 135 మిరపలను హాంఫట్ చేశాడు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ జాక్ మిరపకాయలను తింటున్న వీడియోను తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఒక ఫ్యాన్ పెట్టుకుని చేతులకు, జుట్టుకు రెడ్ బ్యాండ్‌లు కట్టుకున్న జాక్ ఎదురుగా ప్లేట్ తో మిరపకాయలను పెట్టుకుని కూర్చున్నాడు. అతడు వీటిని తింటూ ఇబ్బంది పడుతూ ఉండగా అక్కడ ఉన్న అతడి మద్దతుదారులు జాక్ ప్రోత్సహించడం కనిపిస్తోంది.
New record: Fastest time to eat 50 carolina reaper chilli peppers – 6 minutes and 49.20 seconds by Mike Jack