బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్.. రూ. 4,200 ఫైన్ (వీడియో)

విధాత: ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు త‌న బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్ వేశాడు. కేవ‌లం కుడి వైపు మాత్ర‌మే కూర్చొని బైక్‌ను న‌డిపాడు. ఈ దృశ్యాలను కొంద‌రు యువ‌కులు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఆ వీడియోలు పోలీసుల దాకా చేరడంతో చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ భ‌యంక‌ర‌మైన బైక్ స్టంట్.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌న‌దారుడికి రూ. 4,200 జ‌రిమానా విధించారు. అయితే పోలీసుల‌కు ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు గుంజిలు […]

బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్.. రూ. 4,200 ఫైన్ (వీడియో)

విధాత: ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు త‌న బైక్‌పై భ‌యంక‌ర‌మైన స్టంట్స్ వేశాడు. కేవ‌లం కుడి వైపు మాత్ర‌మే కూర్చొని బైక్‌ను న‌డిపాడు. ఈ దృశ్యాలను కొంద‌రు యువ‌కులు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఆ వీడియోలు పోలీసుల దాకా చేరడంతో చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ భ‌యంక‌ర‌మైన బైక్ స్టంట్.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌న‌దారుడికి రూ. 4,200 జ‌రిమానా విధించారు. అయితే పోలీసుల‌కు ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు గుంజిలు తీసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.

ఇలాంటి స్టంట్స్ ఇంకోసారి చేయ‌న‌ని బాధితుడు స్ప‌ష్టం చేశాడు. ఇక ఈ వీడియోను దుర్గ్ పోలీసులు త‌మ అధికారిక ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా, 1.5 ల‌క్ష‌ల మంది వీక్షించ‌గా, 8 వేల మంది లైక్ చేశారు.