గజ్వెల్: ‘మన ఊరు-మన బడి’ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి

విధాత,మెదక్ బ్యూరో: గజ్వెల్ నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు-మన బడి పథకం అమలు రాష్ట్రం మొత్తం ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గజ్వేల్ నియోజకవర్గంలో మన ఊరు-మన బడి లో కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎమ్సి చైర్మన్, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఎసీవోలు, ఏఈ, డీఈ, ఈఈలు సర్పంచ్ మరియు నిర్మాణ ఎజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]

  • By: krs    latest    Nov 30, 2022 12:46 PM IST
గజ్వెల్: ‘మన ఊరు-మన బడి’ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి

విధాత,మెదక్ బ్యూరో: గజ్వెల్ నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు-మన బడి పథకం అమలు రాష్ట్రం మొత్తం ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గజ్వేల్ నియోజకవర్గంలో మన ఊరు-మన బడి లో కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎమ్సి చైర్మన్, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఎసీవోలు, ఏఈ, డీఈ, ఈఈలు సర్పంచ్ మరియు నిర్మాణ ఎజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఈ మన ఊరు-మన బడి అని, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గమని రాష్ట్రం మొత్తం ఆదర్శంగా నిలిచేలా పనులు జరగాలని, మండలాల వారీగా పాఠశాలలో జరుగుతున్న పథకాల పనుల గురించి అందరూ అధికారులతో సమీక్ష జరిపారు.

దాదాపు మన ఊరు-మన బడి పనులు పూర్తి కావచ్చాయని, పూర్తి అయిన పాఠశాలను కలరింగ్‌కు నమోదు చెయ్యాలని, ఇంకా ఈ పథకంలో ముఖ్యంగా మేజర్ మైనర్ రిపేర్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ఎలక్ట్రిక్ పనులు ముందు పూర్తి చేసి తర్వాత ప్రహరీ, భోజన శాల, అదనపు తరగతి గదులు ఇతరత్రా పనులు చేయాలన్నారు.

పాఠశాలల్లో పూర్తిగా మార్పు రావాలని, పాత స్కూల్, పథకం అమలు తర్వాత కొత్త స్కూల్ ఫోటోలు తీసి ఆల్బం చేసుకోని, ట్యుబ్ లైట్లు కాకుండా స్లాబ్‌కి రూపింగ్ లైట్లు అమర్చుకుని, స్కూల్ పేరు స్టిల్ కలర్‌తో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పెద్ద పనులు ఉన్న దగ్గర టెండర్లు పిలిచి పాతవి తొలగించి పనులు ప్రారంభించాలని, టెండర్ అగ్రిమెంట్ కాపీని ఈ పథకం యాప్‌లో అప్లోడ్ చెయ్యాలని, గజ్వేల్ గడా కింద చేపట్టిన పనులు పూర్తి చేసేలా గడా అధికారికి తెలిపారు.

చేసిన పనులకు ఎప్పటికప్పుడు ఎంబీప్రుప్‌లో రికార్డు చేసి తప్పనిసరిగా ఆన్లైన్‌లో అప్లోడ్ చెయ్యాలని ఏఈ లను హెచ్చరించారు. ఈ మొత్తం పనులను 4 రోజులకోసారి అధికారులంతా పర్యవేక్షణ చెయ్యాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం పదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీఈవో శ్రినివాస్ రెడ్డి, టీఎస్ ఈడబ్లుఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.