మాదిగల ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరే

ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విమర్శించారు

  • By: Somu    latest    Mar 22, 2024 12:41 PM IST
మాదిగల ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరే
  • తగిన గుణపాఠం చెబుతాం
  • ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకుడు మంద క్రిష్ణ మాదిగ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ బిడ్డ గా వరంగల్ జిల్లా కు చెందిన వాడిగా ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా లో కడియం శ్రీహరి తాను మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ ఈ స్థాయికి కడియం శ్రీహరి వచ్చారని వివరించారు.


ఇప్పటివరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వలేదు / ఎదగనివ్వడని విమర్శించారు.

మాదిగల పేరు చెప్పుకొని కడియం శ్రీహరి రాజకీయంగా ఎంతో లబ్ది పొందారని అన్నారు. తాటికొండ రాజయ్యను రాజకీయ కుట్రలతో కడియం శ్రీహరి మోసం చేశారన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు మొదట గుర్తింపునిచ్చింది ఎమ్మార్పీఎస్ అని చెప్పారు. ఎమ్మార్పీఎస్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తాటికొండ రాజయ్య ఎదగడం పట్ల మాదిగల అందరికి గర్వకారణమన్నారు.


తాటికొండ రాజయ్యకు మళ్ళీ కెసిఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారు కానీ కడియం శ్రీహరి వల్లనే రాజయ్యకు అవకాశం లేకుండా చేశారన్నారు. కడియం శ్రీహరి గారికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని కృష్ణ మాదిగ హెచ్చరించారు.