రేవంత్‌రెడ్డి పాలన రెడ్ల పాలనే.. మంద కృష్ణ మాదిగ విమర్శలు

సీఎం రేవంత్‌రెడ్డి తాను మాదిగల మద్దతుతో అధికారంలోకి వచ్చానంటూ చెప్పుకుంటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని

రేవంత్‌రెడ్డి పాలన రెడ్ల పాలనే.. మంద కృష్ణ మాదిగ విమర్శలు

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి తాను మాదిగల మద్దతుతో అధికారంలోకి వచ్చానంటూ చెప్పుకుంటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో నలుగురు రెడ్లు ఉంటే, ఒక్క మాదిగ ఉన్నారన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో 12మంది రెడ్లు ఉంటే ఒక్క మాదిగ ఉన్నాడని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు. రేవంత్ పాలన ఇందిరమ్మ పాలన కాదు..ప్రజాపాలన కాదని మండిపడ్డారు. మాదిగల మద్దతుతో గెలిచిన రేవంత్ అప్పుడు మాదిగలను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించారు. మాదిగలకు చేస్తున్న అన్యాయంపై ఇప్పుడు తాను రెండు ఉదాహారణలే చెప్పానని మునుముందు మరిన్ని వెల్లడిస్తానన్నారు.