Doctor Preethi | డాక్టర్ ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తాం: మాణిక్ రావు థాక్రే
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Doctor Preethi | డాక్టర్ ప్రీతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ(Congress party) అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే(Manik Rao Thackeray) హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా(Janagama district) గిర్ని తండాలోని డాక్టర్ ప్రీతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ప్రీతికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ముఖ్యంగా తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రీతి […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Doctor Preethi | డాక్టర్ ప్రీతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ(Congress party) అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే(Manik Rao Thackeray) హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా జనగామ జిల్లా(Janagama district) గిర్ని తండాలోని డాక్టర్ ప్రీతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ప్రీతికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ముఖ్యంగా తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రీతి మృతికి సంబంధించిన వివరాలను తండ్రి నరేందర్, ఇతర కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ప్రీతికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని భరోసా(Reassurance) ఇచ్చారు. ఈ సందర్భంగా మాణిక్ రావు వెంట పార్టీ నాయకులు రోహిత్ చౌదరి, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, వేణుగోపాల్ రావు తదితరులు ఉన్నారు.