Manipur | నేను దేశాన్ని రక్షించాను.. కానీ నా భార్యను కాపాడుకోలేక‌పోయాను! ఓ కార్గిల్ వీరుడి క‌న్నీటి క‌థ ఇది..

Manipur | మ‌ణిపూర్‌లో కొంత మంది అల్ల‌రిమూక‌లు క్రూర మృగాల్లా, రాక్ష‌సంగా ప్ర‌ర్తించి.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను వివ‌స్త్ర‌లుగా చేసి ఊరేగించిన ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డి.. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తించారు ఆ రాక్ష‌స మూక‌లు. బాధిత మ‌హిళ‌ల్లో ఒకరు.. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పని చేసిన మాజీ సైనికుడి భార్య. త‌న భార్య‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌పై ఆ మాజీ […]

  • By: krs    latest    Jul 21, 2023 1:39 AM IST
Manipur | నేను దేశాన్ని రక్షించాను.. కానీ నా భార్యను కాపాడుకోలేక‌పోయాను! ఓ కార్గిల్ వీరుడి క‌న్నీటి క‌థ ఇది..

Manipur |

మ‌ణిపూర్‌లో కొంత మంది అల్ల‌రిమూక‌లు క్రూర మృగాల్లా, రాక్ష‌సంగా ప్ర‌ర్తించి.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను వివ‌స్త్ర‌లుగా చేసి ఊరేగించిన ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డి.. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తించారు ఆ రాక్ష‌స మూక‌లు. బాధిత మ‌హిళ‌ల్లో ఒకరు.. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పని చేసిన మాజీ సైనికుడి భార్య.

త‌న భార్య‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌పై ఆ మాజీ సైనికుడు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన ఘ‌ట‌న ఇది అని బోరున విల‌పించాడు. నేను దేశాన్ని రక్షించాను.. కానీ నా భార్యను, తోటి గ్రామస్తులను రక్షించుకోలేకపోయాను’ అని క‌న్నీరు పెట్టుకున్న కార్గిల్ వీరుడి క‌న్నీటి క‌థ ఇది. ఈ ఘ‌ట‌న‌పై మాజీ సైనికుడు మీడియాతో మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధం స‌మ‌యంలో దేశాన్ని ర‌క్షించుకున్నాను. కానీ ఈ అమాన‌వీయ ఘ‌ట‌న నుంచి మాత్రం త‌న భార్య‌ను కాపాడులేక‌పోయాన‌ని వాపోయారు.

కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడ‌డ‌మే కాదు.. ఇండియ‌న్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంక‌లోనూ ప‌ని చేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, నా భార్య‌ను, గ్రామ‌స్తుల‌ను మాత్రం ర‌క్షించుకోలేక‌పోయాను అని చెబుతూ వ‌ల వ‌ల ఏడ్చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను ఎంతో బాధిస్తోంద‌ని, కుంగుబాటుకు గురి చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.