Manipur | మణిపూర్‌లో ఆగని హింస.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు

Manipur | రాష్ట్ర వాసుల తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలంటున్న ఏపీ విద్యార్థులు విధాత: మణిపూర్‌లో జాతుల మధ్య జరుగుతున్న హింసలో 54 మంది చనిపోయారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అనధికారిక వర్గాలు మాత్రం ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. సుమారు 200 మందికి పైగా గాయాలయ్యాయని పేర్కొంటున్నారు. మణిపూర్‌లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌ఐటీ క్యాంపస్‌లో 70 […]

  • By: krs    latest    May 07, 2023 7:49 AM IST
Manipur | మణిపూర్‌లో ఆగని హింస.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు

Manipur |

  • రాష్ట్ర వాసుల తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • మమ్మల్ని పట్టించుకోవాలంటున్న ఏపీ విద్యార్థులు

విధాత: మణిపూర్‌లో జాతుల మధ్య జరుగుతున్న హింసలో 54 మంది చనిపోయారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అనధికారిక వర్గాలు మాత్రం ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. సుమారు 200 మందికి పైగా గాయాలయ్యాయని పేర్కొంటున్నారు. మణిపూర్‌లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్‌ఐటీ క్యాంపస్‌లో 70 మంది ఏపీ విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యార్థులను రాష్ట్రానికి రప్పించడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నిట్‌, ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్న దాదాపు 250 మంది తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లును ప్రభుత్వం పూర్తి చేసిందని ఉన్నతాధికారులు చెప్పారు.

ఏపీ సర్కార్‌ మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడురోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇక్కడ తరుచూ పేలుళ్లు జరుగుతున్నాయి. భయాందోళనలో ఉన్నాం.

ఇక్కడి నుంచి తరలించాలని ఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు. అయితే మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మణిపూర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారలు చెబుతున్నారు.