Margadarsi Scam | రామోజీరావు.. ఆ వీడియో లీక్ చేసిందెవరు..?
Margadarsi Scam విధాత: ఇంతవరకూ ఈనాడు అధినేత రామోజీ రావును రాచ ఠీవీగా సోఫాలోనో మహారాజా ఛైర్లోనో కూచుని దర్పగా ఉండగా ఎదురుగా అతిధులు, విశిష్ట అతిధులు ఎవరైనా కాస్త వినయంగా నిలబడి, లేదా ఎదురుగా మామూలు కుర్చీలో కూచుని ఉన్న ఫోటోలు, వీడియోలు చూసాం. అంతే కానీ ఆయన దీనంగా నీరసంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూడలేదు. ఆయన ఫిలిం సిటీలో చిద్విలాసంగా నవ్వుతూ.. వివరిస్తూ నడుస్తున్న ఫోటోలు.. వీడియోలే చూసాం తప్ప ఆయన మంచం […]

Margadarsi Scam
విధాత: ఇంతవరకూ ఈనాడు అధినేత రామోజీ రావును రాచ ఠీవీగా సోఫాలోనో మహారాజా ఛైర్లోనో కూచుని దర్పగా ఉండగా ఎదురుగా అతిధులు, విశిష్ట అతిధులు ఎవరైనా కాస్త వినయంగా నిలబడి, లేదా ఎదురుగా మామూలు కుర్చీలో కూచుని ఉన్న ఫోటోలు, వీడియోలు చూసాం. అంతే కానీ ఆయన దీనంగా నీరసంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూడలేదు. ఆయన ఫిలిం సిటీలో చిద్విలాసంగా నవ్వుతూ.. వివరిస్తూ నడుస్తున్న ఫోటోలు.. వీడియోలే చూసాం తప్ప ఆయన మంచం మీద పడుకుని ఉన్న ఫోటోలు.. వీడియోలు చూడలేదు.
కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల విషయంలో సీఐడీ ఆయన్ను ఆమధ్య విచారించింది. ఈ సందర్భంగా రామోజీ ఓ మంచం మీద పడుకుని ఉండగా ఓ ఫోటో రిలీజయింది. విచారణలో ఫోటోలు బయటకు విడుదల చేయడం అక్రమం,, అనైతికం అంటూ ఏదేదో కామెంట్స్ వచ్చినా మొత్తానికి ఆ ఫోటో మాత్రం సమాజంలోకి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఇప్పుడు అదే ఎపిసోడ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రామోజీకి నడుముకు బెల్ట్ చుడుతున్న సహాయకులు, ఆయన్ను తీసుకొచ్చు బెడ్ మీద పడుకోబెడుతున్న తీరు. నన్ను విచారణలోనే చంపేస్తారా అని ఆయన దీనంగా మాట్లాడుతున్న తీరు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
మరో వైపు మార్గదర్శి ఎండి శైలజ సీఐడీ అధికారులతో కాస్త వినయంగా, మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.. పెద్దాయన ఆరోగ్యం మాకు ముఖ్యం అని ఆమె చెబుతుండగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము విచారణ చేపడతామని అధికారులు చెబుతున్నట్లు అందులో ఉంది. మొత్తానికి ఈ వీడియో రామోజీ ఇమేజీకి దెబ్బతీసిందని కొందరు అంటుంటే.. పోన్లే ఇన్నాళ్లకు ఆయన్ను విచారించిన తీరు ప్రజలకు, సమాజానికి మేలు చేస్తుంది, చట్టం ముందు అందరూ సమానమే అని అర్థం అవుతుంది అని కొందరు అంటున్నారు.
డ్రామోజీ లీలలు… ఇన్నాళ్లు ఫిల్మ్ సిటీ లో ఎన్నో సెట్టింగులు, మ్యాజిక్కులు చేసి ఉంటారు. కానీ, ఇది అంతకిమించి… కాస్త లేట్ అయింది గానీ, మొన్న నామినేషన్స్ కి గానీ పంపించి ఉంటే.. ఈ పెర్ఫార్మన్స్ కి కచ్చితంగా ఆస్కార్ ఎదురు నడిచొచ్చేది..
#margadarshi #ramojirao #margadarsi… pic.twitter.com/lBWytSuruw
— Jagane Kavali (@JaganeKavali) April 27, 2023