పాకిస్తాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

విధాత : పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న సెంట‌ర‌స్ మాల్‌లో ఆదివారం అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలోని మూడో ఫ్లోర్‌లో మంట‌లు చెల‌రేగాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే మిగ‌తా ఫ్లోర్ల‌కు మంట‌లు వ్యాపించాయి. మూడో ఫ్లోర్‌లో ఉన్న మోన‌ల్ రెస్టారెంట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో భ‌యంతో అక్క‌డున్న వారంతా కింద‌కు వ‌చ్చేశారు. ఈ భ‌వ‌నం పై అంత‌స్తుల్లో రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయ‌ని స్థానిక మీడియా తెలిపింది. అయితే […]

పాకిస్తాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

విధాత : పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న సెంట‌ర‌స్ మాల్‌లో ఆదివారం అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలోని మూడో ఫ్లోర్‌లో మంట‌లు చెల‌రేగాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే మిగ‌తా ఫ్లోర్ల‌కు మంట‌లు వ్యాపించాయి.

మూడో ఫ్లోర్‌లో ఉన్న మోన‌ల్ రెస్టారెంట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో భ‌యంతో అక్క‌డున్న వారంతా కింద‌కు వ‌చ్చేశారు. ఈ భ‌వ‌నం పై అంత‌స్తుల్లో రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయ‌ని స్థానిక మీడియా తెలిపింది. అయితే అగ్నిప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది రాలేద‌ని, దాంతోనే మంట‌లు మిగ‌తా ఫ్లోర్ల‌కు వ్యాపించాయ‌ని స్థానికులు పేర్కొంటున్నారు.