మత్స్యగిరి గుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

విదాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం శ్రీమత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పాంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలు బుధవారం స్వస్తివాచనం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణం, గరుడ ధ్వజాదివాసంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తేదీ శనివారం 12:30గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏడవ తేదీ చక్రతీర్థం, దేవతోద్వాసన, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియ నున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు […]

  • By: krs    latest    Nov 02, 2022 2:02 PM IST
మత్స్యగిరి గుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

విదాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం శ్రీమత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పాంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలు బుధవారం స్వస్తివాచనం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణం, గరుడ ధ్వజాదివాసంతో ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తేదీ శనివారం 12:30గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏడవ తేదీ చక్రతీర్థం, దేవతోద్వాసన, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియ నున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కమిటీ చేపట్టింది.