Medak: మైనార్టీలకు.. కాంగ్రెస్ అండగా ఉంటుంది: మాణిక్ రావు ఠాక్రే

సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు పాల్గొన్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి విధాత, ప్రత్యేక ప్రతినిధి మెదక్: మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మైనార్టీలకు మిలాద్ గ్రౌండ్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రేతోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ […]

Medak: మైనార్టీలకు.. కాంగ్రెస్ అండగా ఉంటుంది: మాణిక్ రావు ఠాక్రే
  • సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు
  • పాల్గొన్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి

విధాత, ప్రత్యేక ప్రతినిధి మెదక్: మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మైనార్టీలకు మిలాద్ గ్రౌండ్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు.

ఈ విందుకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రేతోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, మధు యాష్కి, సురేష్ షెట్కార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఏ.ఫయీమ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ మైనార్టీల సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంద న్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అండగా నిలబడుతూ వచ్చారన్నారు. అనంతరం ముస్లింలకు ఠాక్రే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నుంచి ఇక్కడున్న లోకల్ లీడర్ల వరకు అందరు మైనారిటీలకు తోడుగా నిలిచామన్నారు. మిగతా పార్టీల మాదిరిగా కాకుండా మైనారిటీలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉండి వారి పక్షాన కొట్లాడుతుందని తెలిపారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మైనార్టీల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నదన్న ఆయన మైనార్టీల అండతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని ఉత్తం భీమా వ్యక్తం చేశారు.

ఈ ఇఫ్తార్ విందులో ఏఐసీసీ సెక్రటరీలు నాదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్, గాలిఅనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జనరల్ సెక్రటరీ జగదీష్, పున్నారెడ్డి, తోపాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.