LPG Gas Price Hike | కేంద్రంపై.. మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
LPG Gas Price Hike పెరిగిన గ్యాస్ ధరలపై భగ్గుమన్న గులాబీ సేన విధాత: పెరిగిన వంట గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore), కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Bollam Mallaiah Yadav), బడుగుల లింగయ్య యాదవ్ (Lingaya Yadav), దేవరకొండలో ఎమ్మెల్యే […]

LPG Gas Price Hike
- పెరిగిన గ్యాస్ ధరలపై భగ్గుమన్న గులాబీ సేన
విధాత: పెరిగిన వంట గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore), కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Bollam Mallaiah Yadav), బడుగుల లింగయ్య యాదవ్ (Lingaya Yadav), దేవరకొండలో ఎమ్మెల్యే ఆర్. రవీంద్ర కుమార్ (MLA R. Ravindra Kumar), భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (MLA Payla Sekhar Reddy), నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah), హుజుర్‌నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి (Sanampudi Saidireddy)ల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు.
నల్లగొండ గడియారం సెంటర్‌లో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో మహిళల భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Guntakandla Jagadish Reddy) మాట్లాడుతూ కేంద్రం పై విరుచుకు పడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధం లేకుండా గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలను పెంచుతున్న మోడీ బీజేపీ సర్కార్. pic.twitter.com/hOhj3a6xWT
— Jagadish Reddy G (@jagadishBRS) March 3, 2023
అదానీ వ్యవహారంతో ప్రధాని మోదీ (Prime Minister Modi) మోసం బట్టబయలు అయిందని, యావత్ భారత దేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతీలకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజారిటీ మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మేనని ఆయన తెలిపారు.
వ్యవసాయంతో పాటు వ్యాపార,వాణిజ్య గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, కళ్యాణాలక్ష్మీ/షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు,కేసీఆర్ కిట్, వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో ప్రజల నోళ్లలో కేసీఆర్ నిత్యం నానుతున్నారన్నారు.
అదే సమయంలో ప్రధాని మోడీని కూడా ధరల పెంపుతో ప్రజలు నిత్యం తిట్టుకుంటూ స్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధానిగా ఎన్నికయిన రోజున 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఈ రోజు 1200 కు పెరగడమే మోదీ ని ప్రజలు గుర్తుంచుకోవడానికి కారణమైందని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.
ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడూ… ఇప్పుడూ 100 డాలర్లే నన్నారు. అటువంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమెందని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బిజెపి వంచన చేరారని ఆయన దుయ్యబట్టారు. ఇద్దరు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. గుజరాత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి రాహుల్ గాంధీ ఎగనామం పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
అంతెందుకు మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు భారత జోడో యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మునుగోడు ఎన్నికల ప్రచారానికి రాకపోవడం వెనుక దాగి ఉన్న మర్మం కుడా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీకి ఉన్న సంబంధాలే కారణమన్నారు.
యావత్ భారతదేశం బిఆర్ యస్ వైపే చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్ర్య నిర్ములన జరుగుతుందన్న విశ్వసనీయత దేశ ప్రజల్లో బలంగా పెరిగిందన్నారు.పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ తమిళసై పై మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం
విధాత, రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదని, తెలంగాణా బిల్లుల ఆమోదానికి గవర్నర్ తమిళ సై తీరుపై ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశ్యంతోటే తెలంగాణా బిల్లుల మీద గవర్నర్ సంతకాలు పెట్టలేదన్నారు.
తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకోవడమే గవర్నర్ చర్యల లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. కేంద్రంలో ని బీజేపీ డైరక్షన్ లొనే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా బిల్లులను పెండింగ్ పెట్టారని ఆరోపించారు. గవర్నర్ వ్యవహారంలో న్యాయపోరాటంలో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయం దక్కుతుందన్న భీమా వ్యక్తం చేశారు.