మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాలు అనేకం.. మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా

మాజీ మంత్రి మల్లారెడ్డి వేలకోట్ల కబ్జాలు పెట్టాడని, ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే దెబ్బకే నా కొడుకుకు టికెట్ వద్దని వెనుకడుగు వేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు

మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాలు అనేకం.. మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా

ఒక్క బిల్డింగ్ దెబ్బకే కొడుక్కు టికెట్ వద్దంటున్నాడు

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి వేలకోట్ల కబ్జాలు పెట్టాడని, ఒక్క బిల్డింగ్ కూలగొట్టగానే దెబ్బకే నా కొడుకుకు టికెట్ వద్దని వెనుకడుగు వేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా భయపడకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు. మా వాళ్లు పార్టీలు మారకుండా బీఆరెస్ ప్రభుత్వం దుర్మార్గాలపై కొట్లాడారని, ఎవరైనా పార్టీ మారినా మళ్లీ ఆరునెలల్లో కాంగ్రెస్‌లోకి చేరి మొన్నటి ఎన్నికల్లో 50, 60వేల మెజార్టీలతో గెలిచారన్నారు.

ఇది ఇలా ఉండగా నగరంలో గత మూడు నెలల్లో 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. అనధికార నిర్మాణాల గుర్తింపు, కూల్చివేతలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. టీఎస్ బీ పాస్ ద్వారా చెల్లుబాటు అయ్యే అనుమతులు పొందిన తర్వాతనే భవనాలు నిర్మించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను గుర్తించేందుకు జోనల్ కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలను జోనల్ కమిషనర్లు నిశితంగా పరిశీలిస్తున్నారని, అనధికారిక నిర్మాణాలను తక్షణమే కూల్చివేస్తున్నట్లు రొనాల్డ్ రోస్ తెలిపారు.