Minister Komatireddy | బీజేపీవి బెయిల్ ఆండ్ జైల్ గేమ్ రాజకీయాలు

దేశంలో బీజేపీ బెయిల్ ఆండ్ జైలు గేమ్ రాజకీయాలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీపై విమర్శలు సంధించారు

Minister Komatireddy | బీజేపీవి బెయిల్ ఆండ్ జైల్ గేమ్ రాజకీయాలు

మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

విధాత : దేశంలో బీజేపీ బెయిల్ ఆండ్ జైలు గేమ్ రాజకీయాలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీపై విమర్శలు సంధించారు. బీజేపీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతుందని, అవినీతి శాస్త్రం సబ్జెక్ట్‌లో డోనెషన్ బిజినెస్‌తో సహా బోధన చేపట్టిందన్నారు. ఆ పార్టీ అవినీతి పరులకు డెన్‌గా మారిందని ఆరోపించారు. దాడుల ద్వారా విరాళాల సేకరణ ఎలా జరుగుతాయి..విరాళాలు తర్వాత ఒప్పందాలు ఎలా ? జరుగుతాయి…అవనీతి పరులను కడిగే వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుందని, ‘బెయిల్ అండ్ జైల్’ గేమ్ ఎలా ఆడుతున్నారనే కోర్సులను ఆ పార్టీ నేతలకు బోధిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా బీజేపీ అవినీతి పాఠశాలకు శాశ్వతంగా మూసివేస్తామని ట్విట్‌లో పేర్కోన్నారు.