ఆదిలాబాద్‌: ఉట్నూరులో స్వల్ప భూకంపం

విధాత‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంతా నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు రావడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళ‌లో నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. రెండు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు […]

ఆదిలాబాద్‌: ఉట్నూరులో స్వల్ప భూకంపం

విధాత‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

అంతా నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు రావడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళ‌లో నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. రెండు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్ళ‌లోని వస్తువులు కదిలిపోయాయని చెప్పారు.