MLC Kavitha | సుప్రీంలో.. 27కు వాయిదా పడ్డ MLC క‌విత‌ పిటిషన్‌

విధాత‌: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు సుప్రీం కోర్టులో చుక్కెదెరైంది. క‌విత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు(Supreme Court) కాజ్ లిస్ట్‌లో కవిత పిటిషన్ ఉంది. మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంలో కవిత పిటీషన్ దాఖలు చేశారు. కవిత పిటీషన్‌పై న్యాయమూర్తులు […]

  • By: Somu    latest    Mar 23, 2023 12:02 PM IST
MLC Kavitha | సుప్రీంలో.. 27కు వాయిదా పడ్డ MLC క‌విత‌ పిటిషన్‌

విధాత‌: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు సుప్రీం కోర్టులో చుక్కెదెరైంది. క‌విత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

సుప్రీంకోర్టు(Supreme Court) కాజ్ లిస్ట్‌లో కవిత పిటిషన్ ఉంది. మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంలో కవిత పిటీషన్ దాఖలు చేశారు.

కవిత పిటీషన్‌పై న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీనే విచారిస్తామంటూ మొదట తెలిపిన సీజేఐ ధర్మాసనం ఆ తర్వాత 27వ తేదీకి వాయిద వేసింది.