MLC Kavitha | బతుకమ్మ పాటను పాడిన కవిత

సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం MLC Kavitha | విధాత‌, హైదరాబాద్: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాట (Bathukamma Songs) కు సంబంధించిన ఒక వీడియోను బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ […]

  • By: Somu    latest    Aug 14, 2023 12:50 PM IST
MLC Kavitha | బతుకమ్మ పాటను పాడిన కవిత
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
  • అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం

MLC Kavitha | విధాత‌, హైదరాబాద్: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాట (Bathukamma Songs) కు సంబంధించిన ఒక వీడియోను బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది.

భారత్ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను భారత్ జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. +91 8985699999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటల సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అభినందించారు.