Feb13న తెలంగాణకు ప్రధాని మోడీ..షెడ్యూల్ ఖరారు

విధాత, ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న హైదరాబాదుకు రానున్నారు . ప్రధాని పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది.మోడీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. ఇటీవల సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వస్తారని భావించినప్పటికీ ఆయన పర్యటన వాయిదా పడడంతో ఈనెల 15న వర్చువల్ విధానంలో రైలును మోడీ జెండా ఊపి ప్రారంభించారు. కాగా వచ్చే నెల 13న […]

  • By: krs    latest    Jan 21, 2023 8:23 AM IST
Feb13న తెలంగాణకు ప్రధాని మోడీ..షెడ్యూల్ ఖరారు

విధాత, ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న హైదరాబాదుకు రానున్నారు . ప్రధాని పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది.మోడీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు.

ఇటీవల సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వస్తారని భావించినప్పటికీ ఆయన పర్యటన వాయిదా పడడంతో ఈనెల 15న వర్చువల్ విధానంలో రైలును మోడీ జెండా ఊపి ప్రారంభించారు.

కాగా వచ్చే నెల 13న మోడీ పర్యటన నేపథ్యంలో ఈనెల 28న రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించాల్సిన అమిత్ షా టూర్ ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బహిరంగ సభలో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారోనన్నది ఆసక్తికరంగా మారింది.