Monsoon | 62 ఏండ్ల తర్వాత ఆ రెండు మహానగరాలకు ఒకేసారి రుతుపవనాలు..
Monsoon | దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని సరిగ్గా 62 ఏండ్ల తర్వాత ఒకేసారి రుతుపవనాలు పలుకరించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఢిల్లీలో మరో రెండు రోజుల తర్వాత రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కానీ ముందుగానే వచ్చేశాయి. ఇక ముంబై నగరానికి రెండు వారాలు ఆలస్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒకేసారి రెండు నగరాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించినట్లు అయింది. గతంలో జూన్ 21, 1961లో ఇలాగే రెండు మహానగరాల్లోనూ ఒకేసారి […]

Monsoon |
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని సరిగ్గా 62 ఏండ్ల తర్వాత ఒకేసారి రుతుపవనాలు పలుకరించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఢిల్లీలో మరో రెండు రోజుల తర్వాత రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కానీ ముందుగానే వచ్చేశాయి.
ఇక ముంబై నగరానికి రెండు వారాలు ఆలస్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒకేసారి రెండు నగరాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించినట్లు అయింది. గతంలో జూన్ 21, 1961లో ఇలాగే రెండు మహానగరాల్లోనూ ఒకేసారి రుతుపవనాలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
మొత్తంగా.. ఢిల్లీ, ముంబై నగరాలను వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. రుతుపవనాల కారణంగా ఈ రెండు మహానగరాల్లోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ కూడా వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపారు.
సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం రోజుల ఆలస్యంగా జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి. వర్షాలు విస్తారంగా కురిసేందుకు అనువైన పరిస్థితులు వృద్ది చెందుతున్నప్పటికీ.. నైరుతి రుతుపవనాలతో భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.