Rajanna Sircilla | ముగ్గురు పిల్ల‌ల‌తో జ‌లాశ‌యంలో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Rajanna Sircilla విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మద్య మానేరు వంతెన వద్ద విషాదం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంకు చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కి చెందిన మహ్మద్ అలీని ప్రేమించి 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పెళ్లి జరిగినప్పటి నుండి ఇరువురు మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రజిత పుట్టింటి వారు వేములవాడలో పోలీసుల‌కి ఫిర్యాదు చేయగా […]

Rajanna Sircilla | ముగ్గురు పిల్ల‌ల‌తో జ‌లాశ‌యంలో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Rajanna Sircilla

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మద్య మానేరు వంతెన వద్ద విషాదం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంకు చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కి చెందిన మహ్మద్ అలీని ప్రేమించి 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పెళ్లి జరిగినప్పటి నుండి ఇరువురు మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రజిత పుట్టింటి వారు వేములవాడలో పోలీసుల‌కి ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. అయితే రెండు నెలల క్రితం ఇరువురు రాజీకి రావడంతో కేసులు కొట్టివేస్తుా, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే మూడు రోజుల క్రితం రజిత తన పిల్లలతో పుట్టింటికి రాగా, భర్త దగ్గరికి వెళ్లాలని కుటుంబీకులు సూచించారు. దీంతో ఇంటి నుండి వెళ్లిపోయిన రజిత తన పిల్లలతో జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి రజిత, ఉస్మాన్ అహ్మద్ (14), అయ్యన్ (7), అశ్రజాబిన్ (5 నెలలు) జలాశయంలో మునిగి మృతి చెందారు.