Komatireddy | ఈ సారి.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశమివ్వండి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy | నా ప్రచారం.. మీరే నిర్వహించాలి మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విధాత: రెండుసార్లు తెలంగాణ తెచ్చిన పార్టీ అని బీఆరెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమైందని, ఈ దఫా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఒక అవకాశమిచ్చి గెలిపించాలని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం నియోజకవర్గంలో వెలుగు పల్లి గ్రామ పంచాయితీకి చెందిన బీఆరెస్‌, బీజేపీ నాయకులు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి […]

  • By: Somu    latest    Aug 26, 2023 11:19 AM IST
Komatireddy | ఈ సారి.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశమివ్వండి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy |

  • నా ప్రచారం.. మీరే నిర్వహించాలి
  • మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విధాత: రెండుసార్లు తెలంగాణ తెచ్చిన పార్టీ అని బీఆరెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమైందని, ఈ దఫా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఒక అవకాశమిచ్చి గెలిపించాలని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం నియోజకవర్గంలో వెలుగు పల్లి గ్రామ పంచాయితీకి చెందిన బీఆరెస్‌, బీజేపీ నాయకులు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నా ఎన్నికల ప్రచారం, చేరికలు వెలుగు పల్లి నుంచి ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వెలుగుపల్లిని దత్తత తీసుకుంటామని మాయ మాటలు చెప్పి బీఆరెస్‌ గెలిచిందన్నారు. 25 ఏళ్లుగా నేను ప్రజల కోసమే బతుకుతున్నానని, నల్గొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ హాయంలో చేసిన అభివృద్ధే కనిపిస్తోందని, బీఆరెస్ హాయంలో ఒక్క ఇల్లు కూడా గ్రామాల్లో నిర్మించలేదని, చాలామందికి రైతు బంధు కూడా రాలేదన్నారు.

ఎన్నికల తర్వాతా సీఎం కేసీఆర్ మరిన్ని పథకాలకు కోత పెడుతాడన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతుందని, కేవలం ఎనిమిదిన్నర గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని సబ్ స్టెషన్ ఆపరేటర్లే చెబుతున్నారన్నారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని, ఈ జిల్లాలో నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మింపచేస్తే బీఆరెస్ పదేళ్లలో ఇప్పటికీ కాల్వలు కూడా నిర్మించలేదన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం పెండింగ్‌లో పెట్టారన్నారు. వెలుగుపల్లిలో 200 ఇందిరమ్మ ఇల్లు కట్టించామని, కేసీఆర్ ప్రభుత్వం జిల్లా మొత్తం కూడా గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు. నల్గొండ నియోజకవర్గంలో దత్తత గామాలు ఉన్నాయని, ఏనాడైన కేసీఆర్ వాటి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. రేపు ఏం మోహం పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాడోనని, ప్రజలే వారిని నీలదీయాలన్నారు.

కేసీఆర్ తన గజ్వేల్‌లో 25వేల ఇళ్లు కట్టుకున్నాడని, దత్తత తీసుకున్న నల్గొండ ను కూడా గజ్వేల్ లాగానే చూడాల్సిందిపోయి ఒక్క ఇళ్లు కట్టకుండా జిల్లా కేంద్రంలో ఒక మెయిన్ రోడ్డు వేయంచి అదే అభివృద్ధి అని చూపిస్తున్నాడంటూ విమర్శించారు. ఈ రోజు పేదవాళ్లు ఎక్కడ బాధపడ్డగాని, రాజకీయాలకు అతీతంగా నావంతు సహయాన్ని అందిస్తున్నానని, అదే అధికారంలో ఉంటే మరింత సహాయాన్ని అందించే వీలుంటుందన్నారు.

ప్రజల మధ్య ఉంటున్న నన్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, నన్ను మీలో ఒకడనుకుని, నా ప్రచారం మీరే చేయ్యాలని కోరుతున్నానని, ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, అయితే పార్టీ స్టార్ క్యాంపయినగర్‌గా ఇంకా 15 నుంచి 20 స్థానాలను గెలిపించే బాధ్యత నాపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి విడతలోనే రైతులకు రూ.2లక్షల రుణా మాఫీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ సీఎంగా ఎవరున్నా అధికారంలో రాగానే మొదటగా రుణామాఫీ చేయించే బాధ్యతనాదన్నారు.

కేసీఆర్ ఇచ్చే రూ.20,30 వేల రుణామాఫీ బ్యాంకులో వడ్డీకే సరిపోతోందన్నారు. రైతుబంధు ఇస్తారని ప్రజలు మోసపోవద్దని, నిధులు లేక కేసీఆర్ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మాడని, వైన్ షాపులకు నవంబర్ లో పెట్టే టెండర్లను ఇప్పుడే పెట్టి రూ.7వేల కోట్లు సంపాదించాడన్నారు. కేసీఆర్ హైదరాబాద్ లోని భూములను కూడా అమ్మి ఆ డబ్బును అకౌంట్ లో వేసుకున్నాడన్నారు. నల్గొండ జిల్లాలో 12 స్థానాలను గెలిపించండని, మరో వారంలో అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అవుతోందని, కొత్త, పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులంతా గెలుపు కోసం కలికట్టుగా ప్రచారం చెయ్యాలని కోరారు.