మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో TRSలో చేరిన చందుపట్ల, చందంపల్లి, ఈదులూరు ఎంపీటీసీలు

విధాత: దేశ సంపదను ఒకరిద్దరికే కట్టబెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న మోసం ఆదాని కుంభ కోణంతో బట్టబయలైందని మంత్రి జీ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నకేరేకెల్ నియోజకవర్గంలో ముగ్గురు ఎంపిటిసిలు, ఉప సర్పంచ్ వారి వారి అనుచరులు గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయత పేరుతో మభ్యపెడుతూ, దేశ సంపదను త‌న అనునాయులకు కట్టబెట్టేందుకు మోడీ చేస్తున్న మోసాన్ని […]

మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో TRSలో చేరిన చందుపట్ల, చందంపల్లి, ఈదులూరు ఎంపీటీసీలు

విధాత: దేశ సంపదను ఒకరిద్దరికే కట్టబెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న మోసం ఆదాని కుంభ కోణంతో బట్టబయలైందని మంత్రి జీ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నకేరేకెల్ నియోజకవర్గంలో ముగ్గురు ఎంపిటిసిలు, ఉప సర్పంచ్ వారి వారి అనుచరులు గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయత పేరుతో మభ్యపెడుతూ, దేశ సంపదను త‌న అనునాయులకు కట్టబెట్టేందుకు మోడీ చేస్తున్న మోసాన్ని దేశప్రజలు గ్రహిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమౌతున్నారన్నారు.

మోడీ పై విశ్వసనీయత కోల్పోయిన దేశ ప్రజలు, నాయకులు, కార్యక‌ర్త‌లు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న పాలనపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు.

వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్, సాగు నీరు, త్రాగునీరు రంగాలలో సాధించిన విజయాలతో పాటు ఇక్కడ అమల‌వుతున్న సంక్షేమ పథకాలపై ఆసక్తిని పెంచుకున్న దేశ ప్రజలు రేపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిలో చందుపట్ల ఎంపీటీసీ ఇమడపాక లక్ష్మీ వెంకన్న, చందంపల్లి ఎంపీటీసీ బోయిళ్ళ శేఖర్, ఈదులూరు ఎంపీటీసీ తవిడబోయిన భవానితో పాటు నోముల ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి సీపీఎం సీనియర్ నేత భీమనబోయిన యాదగిరి తదితరులు ఉన్నారు.