Mrs India | మిసెస్‌ ఇండియా అందాల పోటీల విజేత హైదరాబాదీ..!

Mrs India | అందాల పోటీల్లో హైదరాబాదీ మహిళ సత్తా చాటింది. మిసెస్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నది. మిసెస్‌ ఇండియా పోటీలు మంగళవారం కేరళ కొచ్చిలోని లీ మెరెడియన్‌ హోటల్‌లో జరిగాయి. ఫైనల్స్‌లో మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన మహిళలు పోటీపడ్డారు. వారందరినీ పక్కకు నెట్టి హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్‌ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నది. మిసెస్ ఇండియా గ్లోబల్ పోటీలను పెగాసిస్ ఈ అందాల పోటీలను నిర్వహించింది. అంకిత ఠాకూర్ స్వస్థలం హైదరాబాద్‌. […]

Mrs India | మిసెస్‌ ఇండియా అందాల పోటీల విజేత హైదరాబాదీ..!

Mrs India | అందాల పోటీల్లో హైదరాబాదీ మహిళ సత్తా చాటింది. మిసెస్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నది. మిసెస్‌ ఇండియా పోటీలు మంగళవారం కేరళ కొచ్చిలోని లీ మెరెడియన్‌ హోటల్‌లో జరిగాయి. ఫైనల్స్‌లో మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన మహిళలు పోటీపడ్డారు. వారందరినీ పక్కకు నెట్టి హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్‌ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నది. మిసెస్ ఇండియా గ్లోబల్ పోటీలను పెగాసిస్ ఈ అందాల పోటీలను నిర్వహించింది. అంకిత ఠాకూర్ స్వస్థలం హైదరాబాద్‌. ఆమె పలు సినిమాల్లోనూ నటించారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆమెకు సహాయక సహకారాలు అందించింది. అంకిత మొదటి ప్రయత్నంలోనే మిసెస్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి.. రెండు టైటిల్స్‌ను సైతం సాధించింది. గతంలో మిసెస్‌ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్‌ శిక్షణలో అంకిత ఠాకూర్‌ తెలంగాణ తరఫున అందాల పోటీలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.