నా భర్త మహా రసికుడు.. 600 ఎకరాలు 30 ఎకరాలు చేశాడు: సీనియర్ నటి
విధాత: చాలా మందికి కాకినాడ శ్యామల ఎవరో పెద్దగా తెలియదు. సాధారణంగా సినిమావారి జీవితాలు సాధారణ మనుషుల జీవితాలు కంటే చిత్రంగా ఉంటాయి. ఎంతో పేరు, ఫేమ్ ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి అవి మేలు చేయలేవు. మనం చూసే సినిమాలలో హీరోయిన్ చెడు వ్యసనాలకు బానిసైన భర్తను మార్చుకుంటుంది కానీ.. నిజజీవితంలో అది పెద్దగా సాధ్యం కాదు. సీనియర్ నటి కాకినాడ శ్యామల ఈ కోవకే చెందినదే. ఆమె భర్త తన చెడు వ్యసనాల కారణంగా 600 […]

విధాత: చాలా మందికి కాకినాడ శ్యామల ఎవరో పెద్దగా తెలియదు. సాధారణంగా సినిమావారి జీవితాలు సాధారణ మనుషుల జీవితాలు కంటే చిత్రంగా ఉంటాయి. ఎంతో పేరు, ఫేమ్ ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి అవి మేలు చేయలేవు. మనం చూసే సినిమాలలో హీరోయిన్ చెడు వ్యసనాలకు బానిసైన భర్తను మార్చుకుంటుంది కానీ.. నిజజీవితంలో అది పెద్దగా సాధ్యం కాదు. సీనియర్ నటి కాకినాడ శ్యామల ఈ కోవకే చెందినదే. ఆమె భర్త తన చెడు వ్యసనాల కారణంగా 600 ఎకరాల భూమిని 30 ఎకరాలకు తీసుకుని వచ్చాడని తన తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మరో చరిత్ర సినిమాతో నా సినీ జీవితం మొదలైంది. కేవలం సినిమాలో నటించడమే కాదు ప్రొడ్యూసర్‌గా కూడా కొన్ని సినిమాలు నిర్మించాను. రెబెల్ స్టార్ కృష్ణంరాజుతో నిత్య సుమంగళి సినిమా తీశాను.. తర్వాత పచ్చబొట్టు అనే సినిమా తీశాం. కానీ ఈ రెండు సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లు మోసం చేశారు. పచ్చబొట్టు అయితే అసలు సినిమా విడుదల కూడా కాలేదు. ఆ సమయంలోనే నాకు పెళ్లయింది. మా మామ మా ఆయనకు 600 ఎకరాలు రాసిచ్చారు.
నా భర్త మాంచి రసికుడు పైగా పని పాటా ఉండేది కాదు. దాంతో 600 ఎకరాలను 30 ఎకరాలు చేశాడు. నేను ఆయనను బాగా తిట్టేదాన్ని. నువ్వు మగాడివైతే సంపాదించి భార్య బిడ్డలను పోషించాలి. అలాంటి మగాడినే నేను ఇష్టపడతాను.. నా దృష్టిలో నువ్వు అసలు మగాడివే కాదు.. అని ముఖం మీదే ఎన్నో సార్లు తిట్టాను. నా భర్త 63 ఏళ్ల వయసులో కాలం చేశారు అని చెప్పుకొచ్చింది.