గరికపాటినీ వదలని నాగబాబు.. సోషల్ మీడియాలో సెటైర్!
విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి అంటే.. దీని వెనుక ఓ పెద్ద కాదులే కానీ.. చిన్న కథే ఉంది. గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కూతురు బండారు విజయలక్ష్మీ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు […]

విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి అంటే.. దీని వెనుక ఓ పెద్ద కాదులే కానీ.. చిన్న కథే ఉంది. గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కూతురు బండారు విజయలక్ష్మీ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి వారు ప్రవచనం మొదలెట్టినప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ వేడుకకు వచ్చిన మహిళలు కొందరు మెగాస్టార్ చిరంజీవితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. తనపై అభిమానంతో వచ్చి అడిగిన వారికి.. చిరంజీవి కూడా కాదనలేక.. ఓపికగా ఫొటోలు దిగుతుంటే, ఇది గరికపాటి వారికి కాస్త అసహనాన్ని కలిగించింది. దీంతో.. బహిరంగంగానే ఆయన చిరంజీవి నీ ఫొటో సెషన్ ఆపు.. లేదంటే నేను లేచి వెళ్లిపోతాను అంటూ కోపంగా మాట్లాడారు.

‘‘అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవిగారికి నా విజ్ఞప్తి.. ఫొటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి.. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి’’ అంటూ గరికపాటి వారు వెలుబుచ్చిన అసహనానికి.. వెంటనే పక్కన ఉన్నవారు అలెర్ట్ అయి.. ఫొటోల కోసం వస్తున్న వారిని పక్కకు పంపించారు. చిరంజీవి వచ్చి.. గరికపాటివారికి క్షమాపణ చెప్పి.. వారి పక్కనే కూర్చుని ప్రవచనాలు విన్నారు. ఇంతటితో సమస్య అయిపోయింది అనుకుంటే.. ఇప్పుడు నాగబాబు ట్వీట్ దీనిని పెద్ద దుమారం చేస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు.. తన అన్నని, తమ్ముడిని ఎవరైనా, ఏదైనా అంటే.. వెంటనే సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ సంధిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. ఇంతకు ముందు యండమూరి విషయం లోనూ నాగబాబు ఇలానే కామెంట్స్ చేశారు. యండమూరి అనే కాదు.. ఎవరైనా ఆయనకి ఒకటే. ఆ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా.

ఇప్పుడు అవధాని గరికపాటివారికి తగిలేలా.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’ అంటూ తనదైన తరహాలో సెటైర్ వేసి.. ఈ విషయాన్ని మెగాభిమానులు భూతద్దంలో చూసేలా చేశాడు. అయితే ఆయన ట్వీట్‌కి కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరికొందరు మెగాభిమానులు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళుతుందో.. ఎటువంటి మలుపులు తిరుగుతుందో.. వెయిట్ అండ్ సీ.