Pawan Kalyan | పవన్ కళ్యాణ్ దెబ్బకి కదిలిన కోలీవుడ్.. నాజర్ ఏమన్నాడంటే..!
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు . కోలీవుడ్ సినిమాల్లో ఇతర భాషల వారిని తీసుకోకుండా కేవలం తమిళులకే అవకాశాలు ఇవ్వాలని 'ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాస తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి రోజా భర్తని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. […]

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు . కోలీవుడ్ సినిమాల్లో ఇతర భాషల వారిని తీసుకోకుండా కేవలం తమిళులకే అవకాశాలు ఇవ్వాలని ‘ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాస తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి రోజా భర్తని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. అయితే పవన్ కామెంట్ చేసిన కొద్ది గంటలకే నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ స్పందించారు. ఇతర భాషలకు చెందిన నటీనటులను తీసుకోకూడదంటూ కొత్త నియమాలు పెట్టినట్టు జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవం అని నాజర్ అన్నారు.
కోలీవుడ్‌లో నిజంగా అలాంటి నియమాలు వస్తే.. అవి వ్యతిరేకించే వారిలో ముందు నేనే ఉంటాను. ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండగా, వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ కలిసి చేస్తేనే మంచి సినిమాలు రూపొందించవచ్చు. తమిళ సినీ కార్మికులను సంరక్షించడం కోసమే కొన్ని ప్రత్యేక రూల్స్ తెచ్చారే తప్ప ఇతర భాషలకు చెందిన నటీనటుల గురించి కాదు. పవన్ కళ్యాణ్‌పై నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందరం కలిసి చేస్తే గొప్ప చిత్రాలు వస్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నేనూ తప్పక అంగీకరిస్తా. ఫెఫ్సీ కొత్త రూల్స్‌పై ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం అందించినట్టు ఉన్నారు అని నాజర్ ఒక వీడియో ద్వారా ఈ విషయాలు తెలియజేశారు.
ప్రస్తుతం పాన్ ఇండియా హవా, ఓటీటీల వినియోగం చాలా ఎక్కువైంది. ఇలాంటి సమయంలో అలాంటి నిబంధనలు ఎవరు కూడా పెట్టరు.వేరే భాషల నుంచి వచ్చిన చాలా మంది ఆర్టిస్టులను, టెక్నిషియన్లను తమిళ సినీ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నసినీ ప్రియులు అందరు మన సినిమాల గురించి ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే కూడా పెద్ద సినిమాలను మనం అందరం కలిసి చేద్దాం అని నాజర్ స్పష్టం చేశారు.