Nalgonda FM | న‌ల్గొండలో.. FM రేడియో ప్రారంభం

Nalgonda FM వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ విధాత: నల్గొండలో, దేవరకొండలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో ట్రాన్స్ మీటర్ స్టేషన్లను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు. 100.1MHZ సామర్థ్యంతో పనిచేసే ఈ రేడియో స్టేషన్ల ద్వారా ఎటు 20 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు జరుగనున్నాయి. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ (ప్రసార భారతి) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నూతనంగా 91 ఎఫ్ఎం […]

  • By: krs    latest    Apr 28, 2023 6:18 AM IST
Nalgonda FM | న‌ల్గొండలో.. FM రేడియో ప్రారంభం

Nalgonda FM

  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

విధాత: నల్గొండలో, దేవరకొండలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో ట్రాన్స్ మీటర్ స్టేషన్లను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు.

100.1MHZ సామర్థ్యంతో పనిచేసే ఈ రేడియో స్టేషన్ల ద్వారా ఎటు 20 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు జరుగనున్నాయి.

ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ (ప్రసార భారతి) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నూతనంగా 91 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ఒకేసారిగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, JL మురుగన్లతో పాటు స్థానికంగా అడిషనల్ కలెక్టర్ కుష్బూ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నాగం వర్షిత్ రెడ్డి,బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా సమాచార ప్రసార శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.