Nalgonda: ఆటో డ్రైవర్ ఔదార్యం..! ఈద్గాకు ఉచిత ప్రయాణ వసతి!!
Nalgonda విధాత: రంజాన్ పర్వదినం సందర్భంగా నల్లగొండ శివారులోని ఈద్గా కు ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరుల కోసం ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించడం అందరిని ఆకట్టుకుంటుంది. స్థానిక జై జవాన్ ఆటో యూనియన్ అధ్యక్షుడు కే. సైదులు ఈద్గా ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరులకు తన ఆటోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని ఆటోకు ప్లెక్సీ ఏర్పాటు చేసి మరి అందరికీ […]

Nalgonda
విధాత: రంజాన్ పర్వదినం సందర్భంగా నల్లగొండ శివారులోని ఈద్గా కు ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరుల కోసం ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించడం అందరిని ఆకట్టుకుంటుంది.
స్థానిక జై జవాన్ ఆటో యూనియన్ అధ్యక్షుడు కే. సైదులు ఈద్గా ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరులకు తన ఆటోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని ఆటోకు ప్లెక్సీ ఏర్పాటు చేసి మరి అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శించాడు.
ఫ్లెక్సీ ప్రదర్శనతో ఈద్గాకు వెళ్లే ముస్లిం సోదరులు సైదులు ఆటోను తమ ప్రయాణానికి ఎంచుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. రంజాన్ రోజు నల్గొండ పట్టణం నుండి ఈద్గా వరకు ముస్లిం సోదరులను తరలించేందుకు వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడుపుతానని సైదులు తెలిపారు.
స్వయంగా హిందువు అయినా సైదులు తన ఆటోలో రంజాన్ రోజు ఈద్గా ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సోదరులకు ఉచిత ఆటో వసతి కల్పిస్తున్న తీరు పట్ల సర్వత్ర అభినందనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమున తహజీబ్ సంస్కృతికి ఆటో డ్రైవర్ నిర్ణయం అద్దం పడుతోందంటూ సైదులును ప్రశంసిస్తున్నారు.