Nalgonda: తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: దుబ్బాక నరసింహా రెడ్డి

Nalgonda విధాత: ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కారణంగా అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర అందించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దుబ్బాక నరసింహ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ(Nalgonda) నియోజకవర్గం కంచనపల్లి ఐకెపి సెంటర్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలను దుబ్బాక పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక మాట్లాడుతూ ధాన్యం రైతుల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. నల్లగొండలో […]

Nalgonda: తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: దుబ్బాక నరసింహా రెడ్డి

Nalgonda

విధాత: ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కారణంగా అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర అందించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దుబ్బాక నరసింహ రెడ్డి డిమాండ్ చేశారు.

నల్లగొండ(Nalgonda) నియోజకవర్గం కంచనపల్లి ఐకెపి సెంటర్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలను దుబ్బాక పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక మాట్లాడుతూ ధాన్యం రైతుల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.

నల్లగొండలో ఇప్పటికే ఐకెపి సెంటర్లలో ధాన్యం కుప్పలు పోసుకున్న రైతులకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదని, కుప్పలపై కప్పుకోవడానికి పట్టాలను అందించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతు కన్నీటి బాధలో ప్రభుత్వం కొట్టుకపోక తప్పదన్నారు.

రైస్ మిల్లర్లతో కుమ్మక్కై నేడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం, ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఐకెపి సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం సత్వరమే కొనుగోలు చేసి, ఎగుమతి చేయాలంటే డిమాండ్ చేశారు. తూకం వేసిన బస్తాల బాధ్యత ప్రభుత్వం యంత్రంగమే తీసుకోవాలన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి రైతు పోరుకు సన్నద్ధం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదేవిధంగా నల్లగొండ (Nalgonda) నియోజక వర్గంలో ఈదురు గాలులకు, అకాల వర్షాలకు మామిడి రైతులు కూడా నష్టపోయరన్నారు. పత్తి రైతులను పట్టించుకోకుండా దళారుల ఇష్టానికి పత్తి కొనుగోళ్లను వదిలేశారన్నారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడి రైతు పడే బాధను మీకు తెలిసే విధంగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టయినా సరే రైతాంగం పడే సమస్యలను, వారు పడే బాధలను మీకు చూపిస్తామన్నారు. కేసిఆర్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి మారకపోతే తెలంగాణ నిరుద్యోగులు, రైతులే నీకు బుద్ధి చెప్తారన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్ ఎంపీపి జిల్లపల్లి పరమేష్, నాయకులు అల్లి సుభాష్ యాదవ్. పగిడిమర్రి వెంకట్ రెడ్డి, పిన్నపు రెడ్డి జాన్ రెడ్డి, పాశం సంజీవ, పుట్ట చంద్రశేఖర్, మహేందర్, పగిళ్ల శివ తదితరులు పాల్గొన్నారు.