Nalgonda: వందే భారత్‌కు జన వందనం..! కిక్కిరిసిన నల్గొండ రైల్వే స్టేషన్.. దారి పొడవునా అపూర్వ ప్రజా స్వాగతం

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరిన వందే భారత్ రైలు చూసేందుకు దారి వెంట ఘట్కేసర్, బీబీనగర్, నాగిరెడ్డిపల్లి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల నార్కట్ పల్లి, శ్రీరాంపూర్, నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరాక మధ్యలో ఎక్కడ ఆగకుండా సాగిన వందే భారత్ రైలు నల్గొండ రైల్వే […]

  • By: krs    latest    Apr 07, 2023 6:25 PM IST
Nalgonda: వందే భారత్‌కు జన వందనం..! కిక్కిరిసిన నల్గొండ రైల్వే స్టేషన్.. దారి పొడవునా అపూర్వ ప్రజా స్వాగతం

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరిన వందే భారత్ రైలు చూసేందుకు దారి వెంట ఘట్కేసర్, బీబీనగర్, నాగిరెడ్డిపల్లి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల నార్కట్ పల్లి, శ్రీరాంపూర్, నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.

సికింద్రాబాద్ నుండి బయలుదేరాక మధ్యలో ఎక్కడ ఆగకుండా సాగిన వందే భారత్ రైలు నల్గొండ రైల్వే స్టేషన్ లో ఐదు నిమిషాల పాటు ఆగింది. రైలును చూసేందుకు పట్టణ వాసులతో పాటు విద్యార్థులు, బిజెపి శ్రేణులు, పరిసర గ్రామాల ప్రజలు వేలాదిగా తరలి రాగా, నల్గొండ రైల్వే స్టేషన్ జనం రద్దీతో కిక్కిరిసింది.

రైలును తమ సెల్ ఫోన్ లలో బంధించేందుకు, ఆగిన తర్వాత రైలు వద్ద నిలుచుని ఫోటోలు దిగేందుకు జనం పోటీలు పడ్డారు. యువకులైతే రైలులో ఎక్కి లోపల క్యాబిన్లను, సీట్ల తీరును ఆసక్తిగా పరిశీలించి సెల్ఫీలు దిగారు. బిజెపి శ్రేణులు, రైల్వే శాఖ అధికారులు రైలుపై పూలు చల్లి స్వాగతం పలికారు.

గతంలో ఏ రైలుకు దక్కని అపూర్వ ప్రజాస్వాగతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు లభించిందని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే వందే భారత్ రైలు ప్రయాణ చార్జీలు మాత్రం అధికంగా ఉన్నాయని, టికెట్ ధరలను తగ్గించాలని ప్రజలు అభిప్రాయపడ్డారు.