Heroine | ఈ యంగ్ హీరోయిన్ కు.. ఓ వ్యాధి వచ్చిందటా!

Heroine : హీరోయిన్ నందిత శ్వేత ప్రజంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నది. తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్నుండి తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. తాజాగా నందిత శ్వేత ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా,  అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సస్పెన్స్ జానర్ హిడింబ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో సినిమాపై […]

  • By: sn    latest    Jul 17, 2023 4:09 AM IST
Heroine | ఈ యంగ్ హీరోయిన్ కు.. ఓ వ్యాధి వచ్చిందటా!

Heroine : హీరోయిన్ నందిత శ్వేత ప్రజంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నది. తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్నుండి తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా మారారు.

తాజాగా నందిత శ్వేత ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా, అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సస్పెన్స్ జానర్ హిడింబ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 20 న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

ఈ సందర్భంగా ఫిల్మ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నందితా శ్వేత రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పింది.

నేను ఫైబ్రోమైయాల్డియా అనే కండరాల రుగ్మతతో బాధ పడుతున్నానని దాని వల్ల ఎక్కువగా డైట్ పాటిస్తానని అన్నారు. అందుకు భారీ వ్యాయామాలు చేయలేను. కానీ ఈ సినిమా కోసం వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. నిద్ర లేకుండా వర్క్ చేశానని.. ఓవర్ స్ట్రెస్ కారణంగానే ఈ సమస్య మరింత ఎక్కువైందంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇదిలావుండగా ఏమండీ ఇటీవల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు పలు రకాల జబ్బులు ఎటాక్ అవుతున్నాయి.

రీసెంట్ గా సమంత.. మయోసైటిస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. హీరోయిన్ కేథరిన్ కు కూడా ఓ జబ్బు ఉందని ఓ ఇంటర్వూలో చెప్పారు. కేథరిన్ వాసన చూడలేదట. అందుకే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది.

ఇక హీరోయిన్ పూనమ్ కౌర్ ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇదో అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో రకాల వ్యాధులతో బాధ పడుతున్నారు.