Narayana | నెల్లూరు అర్బన్ ఇన్‌ఛార్జిగా నారాయణ నియామకం

Narayana | విధాత‌: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖా మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ కాలేజీల అధినేత పొంగూరి నారాయణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక కొన్నాళ్ళు తెరవెనక్కి వెళ్లి ఇదిగో.. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా ఇంఛార్జిగా నియమితులయ్యారు. ఇక్కడ వైసిపి నుంచి అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు . 2019 ఎన్నికల్లో నారాయణ ఆ అనిల్ చేతిలోనే […]

  • By: Somu    latest    Jun 30, 2023 11:53 AM IST
Narayana | నెల్లూరు అర్బన్ ఇన్‌ఛార్జిగా నారాయణ నియామకం

Narayana |

విధాత‌: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖా మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ కాలేజీల అధినేత పొంగూరి నారాయణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక కొన్నాళ్ళు తెరవెనక్కి వెళ్లి ఇదిగో.. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు.

అందులో భాగంగా నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా ఇంఛార్జిగా నియమితులయ్యారు. ఇక్కడ వైసిపి నుంచి అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు . 2019 ఎన్నికల్లో నారాయణ ఆ అనిల్ చేతిలోనే ఓడిపోయారు.

నెల్లూరులో ప్రస్తుతం నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర కొనసాగుతుండగా దానికి నారాయణ సంపూర్ణంగా సహకారం అందిస్తూ వస్తున్నారు. ఖర్చులు.. ఆర్గనైజేషన్ వంటి ప్రక్రియ మొత్తం నారాయణ చూసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వరకు నారాయణకే చంద్రబాబు పెద్దరికం ఇచ్చారు. వాస్తవానికి అమరావతి రాజధాని ఏర్పాటు, భూ సేకరణ వంటి అంశాల్లో అప్పట్లో నారాయణ చెప్పిందే శాసనం అన్నట్లుగా సాగింది.

ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిపోయాక నారాయణ అమరావతి భూకుంభకోణం పేరిట జగన్ ప్రభుత్వం సిట్ విచారణ జరిపించి నారాయణ మీద సైతం కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంతో ఇప్పటివరకూ అయన సైలెంట్‌గా ఉండిపోయారు . ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు.

ఇక ముందు మళ్ళీ అయన పార్టీ బాధ్యతలు మోసేందుకు.. పార్టీకి అన్నివిధాలా అండదండలు అందించేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతమ్ ఇచ్చారు. గతంలో అనిల్ కుమార్ చేతిలో 2019లో కేవలం రెండువేల ఓట్ల లోపే తేడాతో ఓడిపోవడంతో ఇప్పుడు అవి రికవరీ చేసుకుంటూ ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నారు.