Awards to Telangana | రాష్ట్రంలోని 5 గ్రామాలకు జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు
Awards to Telangana | విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తమ పనితీరు కనబరిచిన 5 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రత్యేక కేటగికీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రానికి 2 నానాజి దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ బ్లాక్ పంచాయత్‌లో తిమ్మాపూర్ (కరీంనగర్ ) రెండో స్థానంలో, ఉత్తమ జిల్లా పంచాయతీ కేటగిరీలో ములుగు జిల్లాకు రెండో స్థానం, గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీలో […]

Awards to Telangana |
విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తమ పనితీరు కనబరిచిన 5 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రత్యేక కేటగికీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రానికి 2 నానాజి దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డులు వచ్చాయి.
ఉత్తమ బ్లాక్ పంచాయత్‌లో తిమ్మాపూర్ (కరీంనగర్ ) రెండో స్థానంలో, ఉత్తమ జిల్లా పంచాయతీ కేటగిరీలో ములుగు జిల్లాకు రెండో స్థానం, గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీలో ముఖ్రా-కే (ఆదిలాబాద్ ) మూడో స్థానంలో, కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీలో కన్హా (రంగారెడ్డి) గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ మరో విభాగంలో ఎర్రవెల్లి తొలిస్థానంలో నిలిచాయి. ఈ నెల 17న ఢిల్లీలోరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరగనున్నది.
కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 5 జాతీయ అవార్డులు రావడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..దేశంలో తెలంగాణ మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచింది. జాతీయస్థాయిలో తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండిందన్నారు.
జాతీయ పంచాయతీ అవార్డుల్లో అద్భుత పనితీరును కనబరిచింది. కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే అవార్డులు వచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు, అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Telangana shines yet again ✊
Best performer in National Panchayat Awards
✅ Highest Rise in Per Capita
✅ Best Gram Panchayats
✅ 100% ODF + Villages as per Govt of IndiaAll credit to Visionary CM KCR Garu and his brainchild “Palle Pragathi” which has uplifted the villages… pic.twitter.com/Esc38P7zwA
— KTR (@KTRBRS) April 7, 2023