Hero Nani: వావ్.. వాట్ ఏ లైనప్ నాని

Natural Star Nani విధాత‌: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani). అష్టాచమ్మా (Ashta chamma) సినిమాతో హీరోగా నాని పరిచ‌య‌మ‌య్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నానీ మార్కెట్ 50 కోట్ల […]

Hero Nani: వావ్.. వాట్ ఏ లైనప్ నాని

Natural Star Nani

విధాత‌: టాలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani). అష్టాచమ్మా (Ashta chamma) సినిమాతో హీరోగా నాని పరిచ‌య‌మ‌య్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయాడు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో నానీ మార్కెట్ 50 కోట్ల వరకు ఉందనే మాట వినిపిస్తుంది. ఆయన సినిమాల బడ్జెట్ కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. అలాగే 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక దసరా సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం ద్వారా నాని తన రేంజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమాపై ప్రస్తుతం మంచి బ‌జ్ ఉంది. ఇప్పటికే దసరా 100 కోట్ల వరకు బిజినెస్ జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా తర్వాత నాని సినిమా లైన‌ప్ చాలా గ్రాండ్‌గా ఉందని చెప్పాలి. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి నాని రెడీ అయిపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే దసరా తర్వాత కొత్త దర్శకుడు సౌర్యువ్‌తో కలిసి నాని తన 30వ‌ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 31వ‌ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం త‌ర్వాత శైలేష్ కొల‌ను దర్శకత్వంలో హిట్ 3 చిత్రం చేయ‌నున్నాడు.

ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అందరి హీరోల మాదిరి అన్ని పాన్ ఇండియా లెవెల్‌లోనే కాక.. కథకి యూనివర్సల్ అప్పీల్ ఉంటే మాత్రమే వాటిని పాన్ ఇండియాగా చేసే విధంగా నాని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.