Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార కెరీర్లో దూసుకుపోతున్నది. గతేడాది దర్శకుడు విగ్నేష్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఓ వైపు సినిమాలు, ప్రొడక్షన్ వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకుంటున్నది. హీరోయిన్గా కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఫుల్ బిజీగా ఉన్నది. మరో వైపు నయనతార కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నది. భర్త విఘ్నేష్‌తో కలిసి చెన్నైలోని ఓ ఫేమస్ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. నార్త్ చెన్నై ఏరియాలో […]
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార కెరీర్లో దూసుకుపోతున్నది. గతేడాది దర్శకుడు విగ్నేష్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఓ వైపు సినిమాలు, ప్రొడక్షన్ వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకుంటున్నది.
హీరోయిన్గా కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఫుల్ బిజీగా ఉన్నది. మరో వైపు నయనతార కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నది. భర్త విఘ్నేష్‌తో కలిసి చెన్నైలోని ఓ ఫేమస్ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
నార్త్ చెన్నై ఏరియాలో ఉన్న అగస్త్య థియేటర్‌ను నయనతార భారీ ధరకు సొంతం టాక్ వినిపిస్తోంది. అగస్త్య థియేటర్.. దేవిగ్రూప్ చెందింది. 1967లో ప్రారంభమైన ఈ థియేటర్.. 2020లో కరోనా మహమ్మారి సమయంలో మూతపడింది. దాదాపు వెయ్యి సీటింగ్ కెపాసిటీతో కూడిన థియేటర్‌ను నయనతార, విఘ్నేష్ శివన్ మళ్లీ పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది చివరి నాటికి థియేటర్‌ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ థియేటర్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, తలపతి విజయ్‌తో పాటు చాలా మంది సూపర్ స్టార్ల చిత్రాలను ప్రదర్శించారు.
ఇప్పటికే భర్తతో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను నయనతార నడిపిస్తుంది. అంతే కాకుండా స్కిన్ కేర్ బ్రాండ్‌ను స్నేహితురాలితో కలిసి ప్రారంభించింది. 2021 సంవత్సరంలో చర్మ సంరక్షణ, లిప్‌బామ్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
మరో వైపు జవాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నది. షారుఖ్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న విడుదల కానున్నది. అదే సమయంలో తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్నది. చివరిసారిగా ‘కనెక్ట్’ చిత్రంలో కనిపించింది.