TNGO: కొత్త PRC సత్వరమే ఏర్పాటు చేయాలి.. 18 అంశాలపై TNGO తీర్మానాలు
కారుణ్య నియామకాలు చేపట్టాలి పాత పెన్షన్ విధానం కొనసాగించాలి మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ వెల్లడి విధాత: కొత్త పీఆర్సీని సత్వరమే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో సోమవారం తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం పీఆర్సీతోపాటు.. కారుణ్య […]

- కారుణ్య నియామకాలు చేపట్టాలి
- పాత పెన్షన్ విధానం కొనసాగించాలి
- మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ వెల్లడి
విధాత: కొత్త పీఆర్సీని సత్వరమే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో సోమవారం తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం పీఆర్సీతోపాటు.. కారుణ్య నియామకాలు, పాత పెన్షన్ విధానం అమలు, ఈహెచ్‌ఎస్ సౌకర్యం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు
1. రాష్ట్రంలో 1.7.2023 నుండి అమలు జరిగేలా నూతన పే రివిజన్ కమిటీ నీ వెంటనే ఏర్పాటు చేయాలి.
2. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి.
3. 1.9.2004 నుండి నియమితులైన ఉద్యోగులకు కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలి.
4. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ఒక శాతం చందాతో ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి.
5. గచ్చిబౌలిలోని ఇళ్ళ స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేసి, వెంటనే BTNGO లకు కేటాయించాలి.
6. రాష్ట్ర నూతన సచివాలయంతో పాటు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవో కార్యాలయానికి గదులు కేటాయించాలి
7. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి. రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న పంచాయతి కార్యదర్శులకు ప్రమోషన్ ప్రక్రియ చేపట్టాలి.
8. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి.
9. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు 010 ద్వారా జీతాలు చెల్లించాలి.
10. VRA, VROల సమస్యలను పరిష్కరించాలి.
11. నూతన జిల్లాలకు పాత జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ strength ను మంజూరు చేయాలి.
12. పీఆర్సీ ఆమోదం పొంది, ఇంకా విడుదల గాని ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలి.
13. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలకు ప్రమోషన్ కల్పించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి అన్ని శాఖలలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలి.
14. ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి.
15. డీఏలను వెంటనే విడుదల చేయాలి.
16. టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఎన్నికల గడువు జూన్’2023లో ఉన్నందున గడువు లోగానే ఎన్నికలు జరుపుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
17. నూతన జిల్లాలు, జోనల్ సిస్టమ్ ఏర్పాటు అయిన సందర్భంలో అన్ని శాఖలకు, కేడర్లకు సంబంధించి నూతన సర్వీస్ నిబంధనలు ఏర్పాటు చేయాలి.
18. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని 10 లక్షలకు పెంచాలి.
ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావులతో పాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, కార్యదర్శి, విక్రమ్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.