తల్లీకూతుర్ల మధ్య వివాదం.. పసికందును చంపేసిన అమ్మమ్మ
విధాత: తల్లీకూతుర్ల మధ్య చోటు చేసుకున్న వివాదం ఓ పసికందు ప్రాణాలను బలి తీసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసికందును అమ్మమ్మ నేలకేసి కొట్టింది. దీంతో ఆ పసిబాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. సదాశివపేపట్ట పట్టణానికి చెందిన సత్తగారి సూర్యకళ దినసరి కూలీ. ఆమె భర్త కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. కూతురు మౌనిక.. స్థానికుడైన నర్సింలును ప్రేమించి పెళ్లి చేసుకుంది. మౌనిక గర్భం దాల్చింది. ఏడు […]

విధాత: తల్లీకూతుర్ల మధ్య చోటు చేసుకున్న వివాదం ఓ పసికందు ప్రాణాలను బలి తీసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసికందును అమ్మమ్మ నేలకేసి కొట్టింది. దీంతో ఆ పసిబాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.
సదాశివపేపట్ట పట్టణానికి చెందిన సత్తగారి సూర్యకళ దినసరి కూలీ. ఆమె భర్త కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. కూతురు మౌనిక.. స్థానికుడైన నర్సింలును ప్రేమించి పెళ్లి చేసుకుంది. మౌనిక గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు భర్త నర్సింలు మృతి చెందగా అప్పట్నుంచి మౌనిక తన తల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో 28 రోజుల క్రితం మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే తల్లీకూతురు మధ్య కొద్ది రోజుల నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మళ్లీ ఆదివారం ఉదయం ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన సూర్యకళ.. తన మనుమడిని నేలకేసి కొట్టింది. దీంతో పసిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.