సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌

విధాత‌: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నిక్‌ వుజిసిక్‌ అన్నారు. కాగా, గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్‌ మంగళవారం సందర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్‌ […]

  • By: Somu    latest    Feb 01, 2023 11:56 AM IST
సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌

విధాత‌: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నిక్‌ వుజిసిక్‌ అన్నారు.

కాగా, గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్‌ మంగళవారం సందర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ మంత్రముగ్థులయ్యారు.

‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు.

ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయని, విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన ప్రశంసించారు. ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు.